భోళాశంకర్ సినిమాలో ఎనర్జిటిక్ గా కనిపించారు. పాటల్లో హ్యాండ్సమ్ గా కనిపించారు. ఈ కొత్త లుక్ కు కారణం బయటపెట్టారు చిరంజీవి. ప్రేక్షకులు ఇచ్చిన ఎనర్జీ తోనే అలా తయారయ్యానని అన్నారు.
“ప్రేక్షకులు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడ్ని కాదు. నా నిర్మాతలు, దర్శకులకు నేను రెండో ప్రాధాన్యం ఇస్తాను. తొలి ప్రాధాన్యం ప్రేక్షకులకే. ఏ సాంగ్ చేసినా, ఫైట్ చేసినా, సీన్ చేసినా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించి చేస్తాను. ప్రేక్షకులు చప్పట్లు కొడతారనే ఆశతోనే 200 అడుగుల బంగీ జంప్ చేశాను. మిల్కీ బ్యూటీ సాంగ్ లో మెరిసిపోతున్నారని చాలామంది అడిగారు. తమన్నాతో సమానంగా గ్లామరస్ గా ఉన్నానని అంటున్నారు. నా ఎక్సర్ సైజులు, డైట్ సంగతి పక్కనపెడితే.. ఆ మెరుపునకు కారణం ప్రేక్షకులు ఇచ్చిన ఎనర్జీ.”
భోళాశంకర్ సినిమాలో పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేశారు చిరంజీవి. ఆ సన్నివేశాల్లో తనతో పాటు శ్రీముఖి నటించిందనే విషయాన్ని బయటపెట్టారు. ఇక రీమేక్ అయినప్పటికీ, భోళాశంకర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటనేది వెల్లడించారు.
తమిళ్ లో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చింది భోళాశంకర్. అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా ప్రస్తుతం ఏ ఓటీటీ వేదికపై లేదని, చాలామంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదని, అందుకే నటించడానికి అంగీకరించానని వెల్లడించారు.