చాన్నాళ్ల కిందటి సంగతి. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు చిరంజీవి. నిండు సభలో, ఓ సినిమా ఫంక్షన్ వేదికగా త్రివిక్రమ్ చేయి పట్టుకొని మరీ ప్రకటన చేశారు. ఆ టైమ్ లో త్రివిక్రమ్ కూడా నవ్వుతూ తలూపారు. కట్ చేస్తే, ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. అటు త్రివిక్రమ్ కూడా ఓ సందర్భంలో చిరంజీవితో చేయాల్సిన సినిమాపై ఎలాంటి కామెంట్ చేయలేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, అలాంటి సందర్భమే మరొకటి ఈరోజు రిపీట్ కాబోతోందట. ఈరోజు రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రకటించబోతున్నారట చిరంజీవి.
ఈరోజు సాయంత్రం ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ వేడుకకు రాజమౌళిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించబోతున్నారట చిరు. ప్రాజెక్టు క్రేజీగానే ఉంది కానీ కార్యరూపం దాలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న.
రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా మినిమం మూడేళ్లు కేటాయించాల్సిందే అనే టాక్ ఆల్రెడీ ఉంది. అటు చూస్తే, చిరంజీవి వరుసగా సినిమాలు లైన్లో పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమే.
చిరంజీవి చేతిలో గాడ్ ఫాదర్ సినిమా ఉంది. మరోవైపు బాబి, మెహర్ రమేష్ దర్శకత్వంలో 2 సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల సినిమా కూడా లైన్లో ఉంది. అటు చూస్తే మహేష్ బాబుతో మూవీ కోసం రెడీ అవుతున్నాడు రాజమౌళి. వీళ్లిద్దరూ కలవాలంటే కనీసం మరో మూడేళ్లయినా పడుతుంది.
గతంలో చిరంజీవి స్వయంగా ప్రకటించిన త్రివిక్రమ్ సినిమాకే ఇప్పటివరకు అతీగతి లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే.. స్వయంగా చిరంజీవి ప్రకటించినప్పటికీ, ప్రాక్టికల్ గా, బడ్జెట్ పరంగా అది సాధ్యం కాదనేది ట్రేడ్ సర్కిల్ మాట.