మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. డిజాస్టర్లు ఇచ్చి, చిరకాలంగా దర్శకత్వానికి దూరంగా వున్న మెహర్ రమేష్ కు కూడా అవకాశం ఇచ్చారు. కిందా మీదా పడుతూనే బాబి డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. మరి పూరి జగన్నాధ్ తో ఎందుకు సినిమా చేయకూడదు.
ఫ్యాన్స్ అంతా ఒక యాంగిల్ లో నందమూరి బాలకృష్ణను చూస్తే పూరి జగన్నాధ్ మరోలా చూసారు. మావా ఏక్ పెగ్ లా అంటూ బాలయ్య చేసిన పైసా వసూల్ ఎంత హిట్ అన్నది పక్కన పెడితే కచ్చితంగా ఓకె అనిపించుకున్న సినిమా.
ఇంత మంది హీరోలకు తలా పాత్రను సృష్టించిన పూరి ఓ మాంచి కిక్కిచ్చే క్యారెక్టర్ ను మెగాస్టార్ కోసం రెడీ చేయలేరా? మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన పాటలు, ఫైట్లు, ఫన్ పండించలేరా? మరి మెగాస్టార్ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో? కొడుకును ఇంట్రడ్యూస్ చేసినపుడు పూరి నే కదా కనిపించింది. ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తే భలేగా వుంటుంది కదా?
నిజానికి మెగాస్టార్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. అది అందరికీ తెలిసిందే. దానికి కాస్త యాటిట్యూడ్ తోడయిన పాత్ర చేస్తే ఓ రేంజ్ లో వుంటుంది. పూరి ప్రస్తుతం జంక్షన్ లో వున్నారు. భారీ సినిమా చేసే పరిస్థితి లేదు. అలా అని ఏ హీరో కూడా ఖాళీగా లేరు.
ఇలాంటి టైమ్ లో మెగాస్టార్ కనుక తలుచుకుంటే పూరితో ఓ సినిమా చేయడం అన్నది పెద్ద విషయం కాదు.