షాకింగ్ : టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మృతి!

షాకింగ్ న్యూస్ టాటా స‌న్స్ మాజీ ఛైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. అహ్మ‌దాబాద్ నుండి ముంబైకి వ‌స్తున్నా మిస్త్రీ మ‌హ‌రాష్ట్ర పాల్ఘ‌ర్ జిల్లాలో సూర్య న‌ది వంతెన‌పై అయ‌న ప్ర‌యాణిస్తున్న కారు…

షాకింగ్ న్యూస్ టాటా స‌న్స్ మాజీ ఛైర్మ‌న్ సైర‌స్ మిస్త్రీ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. అహ్మ‌దాబాద్ నుండి ముంబైకి వ‌స్తున్నా మిస్త్రీ మ‌హ‌రాష్ట్ర పాల్ఘ‌ర్ జిల్లాలో సూర్య న‌ది వంతెన‌పై అయ‌న ప్ర‌యాణిస్తున్న కారు డివైడ‌ర్ ను డికొట్ట‌డంతో ఆ ప్ర‌మాదంలో మిస్త్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు పోలీసులు తెలిపారు.

సైరస్ మిస్త్రీ 19వ శతాబ్దంలో పల్లోంజి మిస్త్రీ తాత ప్రారంభించిన నిర్మాణ సంస్థతో ప్రారంభమైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ అధినేత పల్లోంజి మిస్త్రీ చిన్న కుమారుడు. సైరస్ ఇంగ్లండ్‌లో తన ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ముందు ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్‌లో చదివాడు.

2011లో, 1991 నుండి గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాలనే స్పష్టమైన లక్ష్యంతో సైరస్‌ను టాటా గ్రూప్‌కు డిప్యూటీ చైర్మన్‌గా చేశారు. 2012లో రతన్‌ టాటా పదవీ విరమణతో టాటా గ్రూప్‌నకు సైరస్‌ మిస్త్రీ ఛైర్మన్‌ అయ్యారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. 

ఆ పదవి చేపట్టిన నాలుగేళ్లకే అంటే 2016 అక్టోబర్ నెలలో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ బోర్డ్.. సైరస్‌ మిస్త్రీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచించింది. ఆ తరువాత ఛైర్మన్ పదవి నుండి తొలగించింది. ఎందుకంటే..సైరస్‌ మిస్త్రీ సంస్థ నిర్ధేశించిన లక్ష్యాల్ని చేరడంలో విఫలమయ్యారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది.