సెట్స్ పైకొచ్చిన ‘చిరు’ ఫాంటసీ మూవీ

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ వెల్లడించింది. Advertisement ఫాంటసీ కథతో రాబోతోంది చిరంజీవి-వశిష్ఠ సినిమా.…

చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ వెల్లడించింది.

ఫాంటసీ కథతో రాబోతోంది చిరంజీవి-వశిష్ఠ సినిమా. కెరీర్ లో చిరంజీవికి ఇది 156వ చిత్రం. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ట, తన రెండో ప్రయత్నంగా మెగాస్టార్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నాడు దర్శకుడు. సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు విశ్వంభర అనే టైటిల్ అనుకుంటున్నారు.

సినిమాకు సంబంధించి కొన్ని రోజుల కిందట చిరంజీవిపై టెస్ట్ కట్ పూర్తయింది. దానిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన యూనిట్, వెంటనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టింది. త్వరలోనే చిరంజీవి షూట్ లో జాయిన్ అవుతారు.  

కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాలో మొత్తం 6 పాటలుంటాయి. కీరవాణితో జరిపిన మ్యూజిక్ సిట్టింగ్స్ తోనే సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.