నందమూరి నట వారసుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ 60 వ పుట్టినరోజు నేడు. 60వ పుట్టిన రోజు కాబట్టి కాస్త గట్టి హడావుడే చేసారు. ఇంటర్వ్యూలు, టీజర్, పాట, ఇంకా చాలా చాలా హడావుడి. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ జనాలు దాదాపు అందరూ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియచేసారు. మెగాస్టార్ చిరంజీవి తన స్టయిల్ లో అభినందనలు తెలిపారు. ఈ మధ్య ఆయన ట్విట్టర్ లో ఏ అవకాశాన్ని వదలడం లేదు. అందరినీ పలకరించేస్తున్నారు. ఇక అనేక మంది రాజకీయ నాయకులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే శుభాకాంక్షలు తెలియచేయలేదు. ఇక ఆయన బ్రదర్ నాగబాబు సంగతి సరేసరి. హీరో నాగార్జున ఎప్పుడూ దూరమే. ఆయన అలాగే వున్నారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఎవరికన్నా బర్త్ డే అయితే పవన్ తాను ట్వీట్ వేయకపోయినా, తన బ్రదర్ మెగాస్టార్ ట్వీట్ ను రీ ట్వీట్ చేయడమో, లైక్ కొట్టడమో చేస్తారు. అలాగే రామ్ చరణ్ ట్వీట్ లను కూడా.
కానీ బాలయ్య దగ్గరకు వచ్చేసరికి ఈసూత్రాన్ని కూడా పట్టించుకోలేదు. సాయంత్రం వరకు సమయం వుందనో? లేక ఇంకేదైనా కారణం వుందో?