‘గ్రేట్ ఆంధ్ర’ ప్రశ్నకు చిరు సుదీర్ఘ సమాధానం

“బాలకృష్ణ కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కు వచ్చారేంటి?” ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ కు ఎదురైన ప్రశ్న అది. దానికి ఆయన సింపుల్ గా సమాధానం చెప్పాడు. తన ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ,…

“బాలకృష్ణ కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కు వచ్చారేంటి?” ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ కు ఎదురైన ప్రశ్న అది. దానికి ఆయన సింపుల్ గా సమాధానం చెప్పాడు. తన ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ, ఇండస్ట్రీలో కాంపౌండ్స్ లేవన్నాడు.

ఇప్పుడిదే ప్రశ్నకు చిరంజీవి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. ఎంతలా అంటే, అక్షరాలా 7 నిమిషాల పాటు మాట్లాడారు. పరిశ్రమలో కాంపౌండ్స్ లేవన్నారు.

“మనుషులన్న తర్వాత వేరే వాళ్ల మీద అభిమానం ఉండకూడదా.. నా మీద ఆప్యాయత ఉండకూడదా.. నా ఇంట్లోనే చరణ్ కు సూర్య అంటే చాలా ఇష్టం. అంతమాత్రంచేత వాడితో కలిసి నేను భోజనం చేయకూడదా..” అంటూ తన వివరణ మొదలుపెట్టారు చిరంజీవి.

హీరోలందరం కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి అరమరికలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు చిరంజీవి. అభిమానమనేది వ్యక్తిగతమని, పరిశ్రమలో అందరూ ఒకటేనని అన్నారు.

“మనం సెవరేట్ గా, దూరంగా ఉండడం వల్ల మనకు ఓ ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుందని, తద్వారా ఇమేజ్ పెరుగుతుందనే భావం కరెక్ట్ కాదు. హీరోకు ఇమేజ్ పెరగాలంటే, ఫ్యాన్ బేస్ పెరగాలంటే, సినిమా ఇస్తుంది తప్ప, మనల్ని మనం దూరం చేసుకుంటే రాదు.”

తమ కాంపౌండ్ లో హీరోలంతా కలిసిమెలిసి ఉంటున్నామన్నారు చిరంజీవి. పుష్ప-2 పెద్ద హిట్టయినందుకు తను గర్విస్తున్నానన్నారు. అదే టైమ్ లో కొన్ని సినిమాలు ఆడకపోవచ్చని, హిట్టయినప్పుడు మాత్రం ఇండస్ట్రీ అంతా గర్వించాలన్నారు. పరిశ్రమలో ఎలాంటి కాంపౌండ్స్ లేవని చెప్పడం కోసమే విశ్వక్ సేన్ నటించిన సినిమా ఫంక్షన్ కు వచ్చానని, పరిశ్రమ అంతా ఒకటే కాంపౌండ్ అంటూ ముగించారు చిరంజీవి.

11 Replies to “‘గ్రేట్ ఆంధ్ర’ ప్రశ్నకు చిరు సుదీర్ఘ సమాధానం”

  1. క్లిక్ బెయిట్ లకోసం తహ తహ లాడే మూర్తి గారి లాంటి మేధావులకి చిరంజీవి గారు చక్కగా సమాధానం చెప్పారు

  2. అరే బ్రో..

    ఎవడో పుట్టించిన బిడ్డకు ని పేరు పెట్టుకోవడం ఎంత వరకూ కరెక్ట్ . మీ ఫీల్డ్ రిపోర్టర్ ని అడిగి ఆ ప్రశ్న ఎవరు వేశారో తెలుసో. లైవ్ చూసి ఆర్టికల్స్ రాయకు.

  3. ఇంకా ఇలాంటి తలతిక్క ప్రశ్నల వలనే నెటిజన్స్ మీడియా ని ఓ రేంజ్ లో అడుకుంటున్నారు. మెగాస్టార్ కూడా తెలియకుండా వాత పెట్టారు. ఇప్పటికైనా నిజమైన జర్నలిజం తో వార్తలు రాయండి.

  4. Nud cal estanu >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

Comments are closed.