సాధారణంగా అబ్బాయిల నుంచి ఈ డైలాగ్ వస్తుంది. అమ్మాయిల నుంచి పెద్దగా రాదు. హీరోయిన్ల నుంచి అస్సలు రాదు. వాళ్లు ప్రేమించాలనుకుంటే ఎంతోమంది క్యూ కడతారు. హీరోయిన్ సీరత్ కపూర్ మాత్రం దీనికి రివర్స్ లో ఉంది.
“ఈ వాలంటైన్స్ డేకి ప్లాన్స్ ఏంటి..” సీరత్ కు ఎదురైన ప్రశ్న ఇది. దీనికి ఆమె ఫన్నీగా సమాధానమిచ్చింది. ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని, లవర్ లేడని, వాలంటైన్స్ డేకి ఎవరైనా రోజా పువ్వు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
ఆమె సరదాగా చెప్పినప్పటికీ.. సీరత్ కపూర్ పై ఇప్పటివరకు పెద్దగా డేటింగ్ రూమర్స్ వినిపించలేదు. ఆమె ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు కనిపించలేదు. కాబట్టి ఆమె చెప్పే మాటలు నమ్మొచ్చనిపిస్తోంది.
ఉన్నఫలంగా హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది ఈ ముద్దుగుమ్మ. ఐదేళ్ల కిందట తను చేసిన ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమా ప్రచారం కోసం వచ్చింది. ఈ సినిమాకు పేరు మార్చి, ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్ తో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఐదేళ్ల కిందట ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Nud cal available >>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది