కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘క‌మ్మ‌’గా!

సీఐ సెల్ స్విచ్చాఫ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదే ప‌ని కొలిక‌పూడి చేసి వుంటే మీడియా ఊరుకునేదా?

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన ఎమ్మెల్యే ఎవ‌రంటే?… తిరువూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు పేరు వినిపిస్తుంది. త‌ప్పు ఎవ‌రు చేసినా, ఒకేలా చూడాలి. కానీ టీడీపీ అనుకూల మీడియా బ‌లంగా వుండ‌డంతో వైసీపీ అక్ర‌మాల‌పై మాత్ర‌మే క‌థ‌నాలు రాయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. అంతేకాదు, సామాజిక ప్ర‌యోజ‌నాల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని, ఒక్కోసారి సొంత పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల్ని కూడా టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇందులో భాగంగానే త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని స‌న్నిహితుల వ‌ద్ద తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి వాపోతున్నారు. కొలిక‌పూడి ఆవేద‌న‌లో అర్థం వుంద‌నే ఘ‌ట‌న ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. విజ‌య‌వాడ రూర‌ల్ ప‌రిధిలోని అంబాపురం గ్రామంలో ఒక స్థ‌ల విష‌య‌మై హైద‌రాబాద్‌కు చెందిన క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ విభాగంలో ప‌ని చేసి రిటైర్డ్ అయిన జ‌క్ర‌య్య ఫిర్యాదు మేర‌కు ఆ గ్రామ స‌ర్పంచ్ సీత‌య్య‌, మ‌రి కొంత మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.

ఈ కేసు న‌మోదులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కొత్తపేట సీఐ చిన కొండ‌ల‌రావుకు… త‌మ నియోజ‌క వ‌ర్గం మాదిరిగానే ఎమ్మెల్యే కూడా “వ‌రం”లాంటోడ‌ని భావించిన ప్ర‌జాప్ర‌తినిధి ఫోన్ చేసి తీవ్ర‌స్థాయిలో దూషించార‌ని స‌మాచారం. నోటికొచ్చిన‌ట్టు సీఐని తిట్టార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అస‌లేం జ‌రిగిందో చెప్ప‌డానికి సీఐ ప్ర‌య‌త్నించినా, ఆ “క‌మ్మ‌”ని ఎమ్మెల్యే వినిపించుకోలేద‌ని పోలీసులు అంటున్నారు.

దీంతో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన సీఐ క‌నీసం ఉన్న‌తాధికారుల‌కు కూడా చెప్ప‌కుండా, అనారోగ్యంగా ఉంద‌ని, సెల‌వు చీటి పంపిన‌ట్టు తెలిసింది. అంతేకాదు, సీఐ సెల్ స్విచ్చాఫ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదే ప‌ని కొలిక‌పూడి చేసి వుంటే మీడియా ఊరుకునేదా? అని కొలిక‌పూడి అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.

22 Replies to “కొలికపూడి చేస్తే నేరం… ఆ ఎమ్మెల్యే సీఐని తిడితే ‘క‌మ్మ‌’గా!”

  1. ఈ గాడు ఎడవలెక, కులాల మీద పడి ఎడుస్తున్నాడు! కనీసం అలా అన్నా జగన్ కి కాస్త ఉతం ఇద్దాం అని వీడి ఆశ!!

    .

    ముందు నీ ఎర్రగజ్జి ఎక్కడన్నా చూపించుకొరా GA!

  2. నువ్వె ఈ MLA కొలికపూడి గురించి కదలు కదలు గా రాసి విమర్సించావ్! మళ్ళి ఈ గాలి మాటలు ఎందుకురా GA???

    1. ఓహో.. అయితే.. గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అనంత బాబు లాంటి వాళ్ళు ఉన్న పార్టీ అధ్యక్షుడు “అంతర్జాతీయ” స్థాయి లీడర్ అనుకోవచ్చా.. తప్పేముంది.. ?

      వామ్మో.. మా అజ్ఞాన రెడ్డి అంతర్జాతీయ స్థాయి కి ఎదిగిపోయాడు అని సంబరపడిపోతారేమో.. ఈ గొర్రెలు..

  3. లక్ష్మి రెడ్డి అరెస్ న్యూస్ GA లో లేదేంటి? 11 రెడ్డి ఏ డ్రామా ఆడినా ఈజీ గా దొరికి పోతున్నాడు. గులుక రాయి, కోడి కత్తి … . కొంచం మంచి ఆర్టిస్ట్ ల ను పెట్టండి

Comments are closed.