రాహుల్ జగన్ బీజేపీకి కావాలట!

విజయాలు చాలా మాట్లాడిస్తాయి. బీజేపీ దేశంలో వరస విజయాలు సాధిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు చాలానే మాట్లాడుతున్నారు. బీజేపీ విజయాల గురించి నాయకులు అందరూ మాట్లాడుతూంటే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమ్మార్…

విజయాలు చాలా మాట్లాడిస్తాయి. బీజేపీ దేశంలో వరస విజయాలు సాధిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు చాలానే మాట్లాడుతున్నారు. బీజేపీ విజయాల గురించి నాయకులు అందరూ మాట్లాడుతూంటే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమ్మార్ రాజు ఆ పార్టీ విజయాన్ని మరోలా చెప్పడమే హాట్ టాపిక్.

కేంద్రంలో విపక్ష పాత్రలో రాహుల్ గాంధీ ఉన్నంతవరకూ బీజేపీ విజయాలకు ఢోకా లేదని రాజు గారు అంటున్నారు. కాంగ్రెస్ నాయకుడిగా రాహుల్ గాంధీ అపొజిషన్ లో ఉంటే బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అని కొత్త నిర్వచనం చెప్పారు.

అంతే కాదు ఏపీలో జగన్ అపొజిషన్ లో ఉన్నంతవరకూ కూటమి ప్రభుత్వానికి ఎదురులేదని కూడా మాట్లాడారు. ఏపీలో వైసీపీ పని అయిపోయింది కాబట్టి ఆ పార్టీ నాయకులు అంతా బయటకు రావాలని ఆయన కోరారు. వారికి బీజేపీ అండగా ఉందని ఆహ్వానించేశారు.

రాజు గారి మాటలను తీసుకుంటే ప్రతిపక్షం వీక్ గా ఉండడం వల్లనే బీజేపీ గెలుస్తోందా అన్న అర్ధం వచ్చేలా ఉందని అంటున్నారు. అయితే పరిస్థితులు అనుకూలం కానపుడు ఎవరైనా వీక్ అన్నది కూడా రాజకీయ చరిత్ర చెబుతోంది అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ ప్రచారం చేసిన కర్ణాటక, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ లలో బీజేపీ ఓడింది కదా అని గుర్తు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ గెలవడానికైనా అనేక ఫ్యాక్టర్లు పనిచేస్తాయని అంటున్నారు.

అందువల్ల ప్రత్యర్ధులను తక్కువ చేయడం కంటే కూడా తమకు ప్రజలు అప్పగించిన బాధ్యతలు దక్కిన విజయాలతో మంచి పనులు చేయడమే ఏ రాజకీయ పార్టీకైన ప్రథమ కర్తవ్యం అవుతుందని అంటున్నారు. రాజకీయమే కాదు ఏ రంగంలో అయినా ఏ వ్యక్తికైనా అపజయంతో అదే ఆఖరు కాదని విజయానికి తొలి మెట్టు గా మారిన సందర్భాలు అనేక ఉన్నాయని చెబుతున్నారు. ఇక బీజేపీ గెలుపు సంబరంలో ఉంది. అందువల్ల అభినందించడమూ అందరి బాధ్యత. సో ఆల్ ద బెస్ట్ టూ బీజేపీ.

10 Replies to “రాహుల్ జగన్ బీజేపీకి కావాలట!”

  1. Vc available >>> తొమ్మిది, మూడు, ఎనిమిది, సున్న, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు.

  2. ఇక్కడే మన సత్తా ఏమిటో చూపించాలి వెంకట్ రెడ్డి.. టిట్ ఫర్ టాట్ .. దెబ్బకు దెబ్బ కొట్టాలి..

    ..

    అర్జెంటు గా మన సింగల్ సింహాన్ని బెంగుళూరు పాలస్ లో ప్రెస్ మీట్ పెట్టి.. ఈవీఎంలు హ్యాక్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందని.. ప్రజస్వామ్యం చచ్చిపోతోందని.. గట్టిగా అరిచి.. దిక్కులు పిక్కటిల్లేలా.. భూగోళం నలు వైపులా వినిపించేలా.. అరిచి.. ప్రశ్నిద్దాం..

    ..

    ఈవీఎంలపైన పోరాటానికి ఇదే నాంది కావాలి.. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జగన్ రెడ్డి ఆద్యుడు కావాలి..

    ఇదే సమయం.. ఉప్పెనలా ఉరికి రావాలి.. (కింద కాయ కోసేస్తారని భయపడి ఆగిపోతాడేమో.. ఏమో..)

    1. Correct. అప్పట్లో CBN గారు Delhi లో కూడా ప్రెస్ meets పెట్టి, ఎవరో గొట్టం గాడితో demo కూడా ఇప్పించినట్లు చేయాలి కదా.

    2. ఒంటరి సింహం తింగరది కాదు హస్తినలో ఉన్న వారి మీద కాదు రాష్ట్రంలో ఉన్న వారి మీద మాత్రమే అరిచేది

    3. Vaadi kaaallu veedi vattakaayalu pattukune gelichaaru…marchipokudadu. single gaa raavadam anedi aa party 2014 nundi teeskunna stand. Ade follow avtaaru. Nuv entha vetakaaram chesinaaa individual vote share lo nuv thitte party annintikannaa ekkuva ani meeku kuda telsu.

  3. Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

Comments are closed.