బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10న షూటింగ్ అనంతరం భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లిన చిత్ర గదిలో ఉరి వేసుకొంది.
అల్లుడే తన కూతురిని కొట్టి, చిత్రహింసలకు గురి చేసి చంపాడని చిత్ర తల్లి ఆరోపించారు. పోస్టుమార్టంలో మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో బలవన్మరణానికి చిత్ర పాల్పడేలా ప్రేరేపించాడనే కారణంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ చిత్ర భర్త హేమనాథ్ సహా ఆమె స్నేహితులు, సహ నటులను విచారించామన్నారు.
సీరియల్‌లోని కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే ఆమె ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లిందన్నారు. టీవీలో చిత్ర నటించిన పలు సీన్ల గురించి హేమనాథ్ అభ్యంతరం తెలిపాడన్నారు.
అదే రోజు ఆమె మృతిచెందిందన్నారు. చిత్రను అతడు నెట్టివేయడంతో తీవ్ర వేదనకు గురై జీవితంపై విరక్తి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు.