అమరావతి కావాలని ఎవరు అడిగారు అచ్చెన్నా…?

పాలకులు ముందు చూపుతో ప్రజల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిదే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం. మూడు ప్రాంతాలూ  సమానంగా అభివృద్ధి చెందాలని జగన్ ఈ సంచలన నిర్ణయం…

పాలకులు ముందు చూపుతో ప్రజల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిదే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం. మూడు ప్రాంతాలూ  సమానంగా అభివృద్ధి చెందాలని జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇపుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు హోదాలో మూడు రాజధానులు ఎవరు అడిగారు అంటూ అచ్చెన్నాయుడు గర్జిస్తున్నారు. గొంతు సవరించుకుని మరీ జగన్ని నిలదీస్తున్నారు.

మరి అదే ప్రశ్న తన పార్టీ పెద్ద చంద్రబాబుని కూడా అచ్చెన్నాయుడు వేయాల్సిందే కదా. అమరావతిలోనే రాజధానిని పెట్టమని ఎవరు అడిగారు బాబూ అని ఇదే అచ్చెన్న ఆనాడు కాకపొయినా ఈనాడు అయినా  అడిగి ఉంటే బాగుండేదేమో.

అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నా అమరావతికి జై అని అంటూంటే ఉత్తరాంధ్రా జనం 2019 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును అపుడే మరిచారా అని అనాల్సివస్తోంది మరి.

అచ్చెన్నాయుడుకు అమరావతి కావాలేమో కానీ ఉత్తరాంధ్రావాసులకు విశాఖ రాజధాని కావాలి. అయినా ఒకరు అడిగితే ఇచ్చేది మామూలు రాజు చేసే పని. అడగకుండా సమస్యలను అర్ధం చేసుకుని అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చే పాలకులను గొప్పవారు అనాలి.

ఎటూ వైరిప‌క్షంలో ఉంటూ నిత్యం వైసీపీని నిందించే అచ్చెన్నకు ఇవి అర్ధం కావు కానీ విశాఖకు రాజధాని వద్దూ అని రేపటి గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా చెప్పి టీడీపీ ఓట్లు అడిగితే ఏ రకమైన ఫలితాలు వస్తాయో అచ్చెన్న కళ్ళారా  తెలుసుకుంటే మంచిదేమో.

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?