Advertisement

Advertisement


Home > Movies - Movie News

'చూసీ చూడంగానే..నచ్చిందా? లేదా'

'చూసీ చూడంగానే..నచ్చిందా? లేదా'

ప్రేమ అంటే అంతే కలిసి వుంటే మధురంగా వుంటుంది..విడిపోతే అంతకు అంతా బాధపెడుతుంది. కుర్రకారు లవ్ స్టోరీ అంటే కొత్తగా ఏముంటుంది.

జీవితంలో ప్రతి రంగంలో ఫెయిల్యూర్ లు చవిచూసిన హీరో కథ ఇది అని తెలుస్తోంది. కొత్త దర్శకులు, కొత్త అయిడియాలతో వస్తున్న రోజుల్లో ఈ ట్రయిలర్ చూస్తుంటే బాగా రొటీన్ గా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మ సతాయింపు, చదువు మీద కన్నా తన ఆసక్తి మీద తపన, కాలేజీలో పరిచయం, మనసులు కలిసినా, అభిప్రాయాలు తేడా, బ్రేకప్, ఆపై మళ్లీ మరో పరిచయం. ఈసారి పూర్తిగా కాంట్రాస్ట్ వ్యవహారం. ఇలా ట్రయిలర్ మొత్తం, కొత్త దనం లేకుండా, అలవాటైపోయిన సినిమా కథలనే గుర్తు చేసింది. 

వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రయిలర్ లో వినిపించడం  మొదలైన డైలాగులు కూడా పెద్దగా కొత్తదనాన్ని వినిపించలేదు. 'సిద్దూ నువ్వు ఇది వరకు లా లేవు...నువ్వు చెప్పినట్లే వున్నానుగా..మ్యూజిక్ నాకు లైఫ్..ఇలా డైలాగులు అన్నీ కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. 

రాజ్ కందుకూరి అభిరుచి వున్న నిర్మాత. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో వంటి భిన్నమైన సినిమాలు అందించి పేరు తెచ్చుకున్నారు. మరి ఆయన తన కొడుకు కోసం యాక్సెప్ట్ చేసిన స్క్రిప్ట్ లో ఏదో సమ్ థింగ్ వుండే వుండాలి. అలా అనుకుంటే ట్రయిలర్ కట్ చేయడంలోనే తేడా వుండి వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?