Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పీడ్ పెంచిన నిఖిల్.. మరో సినిమా లాక్

స్పీడ్ పెంచిన నిఖిల్.. మరో సినిమా లాక్

వచ్చే ఏడాది కనీసం 2 సినిమాలు రిలీజ్ చేస్తానని, వీలైతే 3 సినిమాలు కూడా రావొచ్చంటూ రీసెంట్ గా ప్రకటించాడు నిఖిల్. చెప్పినట్టుగానే ఇప్పుడు స్పీడ్ పెంచాడు. కార్తికేయ-2 సినిమాకు ఇప్పటికే కాల్షీట్లు కేటాయించిన ఈ హీరో, ఇప్పుడు గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నాడు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మాతగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా చేయబోయే సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు స్పెషల్ ఎట్రాక్షన్ సుకుమార్. అవును.. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడమే కాకుండా, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు.

కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నందుకు సుకుమార్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఏకంగా సినిమాలో షేర్ తీసుకుంటున్నాడు. ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు సుక్కూ. అల్లు అరవింద్ ఎప్పట్లానే సమర్పకుడిగా వ్యవహరిస్తారు.

సుకుమార్ తో సినిమా చేయాలనే కోరికను నిఖిల్ ఇలా నెరవేర్చుకుంటున్నాడు. కార్తికేయ-2 ఓ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే, సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఆ వెంటనే హనుమంతు అనే మరో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నిఖిల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?