దళం, జార్జిరెడ్డి వంటి వైవిధ్య భరితమైన ప్రయత్నాలు చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి, దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీల కాంబోలో రూపొందుతున్న చోర్ బజార్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
తొలి రెండు సినిమాలతో వైవిధ్యత, ప్రయోగానికి ప్రాధాన్యతను ఇచ్చిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సారి ఎలాంటి ట్రీట్ ఇస్తాడనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది ఈ టైటిల్.
చోర్ బజార్ సామానంతా టైటిల్ పోస్టర్ లో కనిపిస్తోంది. ఇది వరకూ ప్రయోగాత్మక సినిమాలతో వచ్చిన దర్శకుడు మాస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ తో స్పష్టత వస్తోంది.
ఇందులో హీరో పేరు బచ్చన్ సాబ్ అంటూ పూరీ మరో వీడియో విడుదల చేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోంది.