Advertisement

Advertisement


Home > Movies - Movie News

అవార్డులు.. ఇది సరైన పద్దతేనా?

అవార్డులు.. ఇది సరైన పద్దతేనా?

తెలుగు సినిమా రంగంలో సరైన అవార్డుల సిస్టమ్ ఎప్పుడూ లేదు. నంది అవార్డులు ప్రభుత్వం తరపున వుండేవి కానీ, అవన్నీ రకరకాల ప్రభావాలకు లోనై వుండేవి. ఒక్కోసారి పెర్ ఫెక్ట్ సెలెక్షన్ వుండేది. మరోసారి వీళ్లకు ఎలా ఇచ్చారబ్బా అనేట్లు వుండేది.

ఇక తామరతంపరగా అనేకానేక ప్రైవేటు అవార్డుల ఫంక్షన్లు జరిగేవి కానీ, రాను రాను పెద్ద స్టార్లు వాటికి రాకపోవడంతో అవీ మూలన పడ్డాయి. సైమా అనే అవార్డులు పక్కా కార్పొరేట్ అవార్డులు, అదంతా వ్యాపారం. అవార్డులకు అంతా హైఫై టచ్. భారీ ఖర్చు.. భారీ ఆదాయం అదంతా వేరే. అందువల్ల వాటి వల్ల నిజమైన కళ కు ఉపయోగం పెద్దగా వుండేదీ లేదు.

ఇలాంటి టైమ్ లో సరైన అవార్డుల కార్యక్రమం అనేది అవసరం వుంది. నంది అవార్డుల స్థానంలో వేరే అవార్డుల కార్యక్రమం ప్రవేశపేడతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతూంది. కానీ అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో తెలియదు. ఇలాంటి నేపథ్యంలో పీపుల్స్ మీడియా సంస్థ దక్షిణాది సినిమా అవార్డులు అంటే ఏదో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. దాని విధి విధానాలు ఇంకా బయటకు రాలేదు. గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

ఫిలిం అవార్డులా? ఫిలిం ఫెస్టివల్ నా? లేదా షార్ట్ ఫిలిం కంటెస్ట్ నా? అన్నది తెలియాల్సి వుంది. ఆహా ఓటిటి సంస్థతో టై అప్ పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నట్లున్నారు. అంటే టోటల్ కార్యక్రమం అంతా సైమా మాదిరిగానే క్లోజ్డ్ డోర్స్ లో జరుగుతుంది. దాన్ని ప్రసారం చేసే హక్కులు ఆహాకు ఇస్తారని అనుకోవాలి. ఆహా ఇచ్చే అమౌంట్ ను అవార్డుల ఫంక్షన్ నిర్వహణకు ఖర్చు చేస్తారు.

కానీ ఇలాంటి వాటి వల్ల ఏమిటి ప్రయోజనం. కేవలం ఓటిటి లోనో, టీవీలోనో చూసుకోవడం తప్ప లైవ్ అనుభూతి కామన్ మాన్ కు రాదు. పైగా ఆహా సంస్ధ‌ 2500 తన చందాలను పెంచుకోవడానికి దీన్ని వాడుకోవాలని చూస్తోంది. 2500 కడితే చందా తో పాటు పాస్ ఇస్తామని, ఫంక్షన్ చూడవచ్చని ప్రకటించింది. ఎంత మంది 2500 కట్టి పాస్ లు తీసుకోగలరు.

నిజానికి సైమా, ఇంకా ఇలాంటి వాటిని హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప, నిజంగా పబ్లిక్ ఫంక్షన్ చేస్తాము అని ఎవరైనా ముందుకు వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచస్తారు. గతంలో ఫిలిం ఫేర్ అవార్డుల మాదిరిగా సితార అవార్డులు వుండేవి. అవి ఏ చందాలు తీసుకోకుండా పబ్లిక్ లో ఫ్రీ గా నిర్వహించారు. కానీ సితార సంస్థ సినిమా నిర్మాణాల్లోకి వచ్చిన తరువాత ఆ అవార్డులను ఆపేసింది.

ప్రస్తుతం పబ్లిక్ లో జరిగే అవార్డుల ఫంక్షన్ ఏదీ లేదు. పీపుల్స్ మీడియా సంస్థ అయిన కనీసం ఇలా చేస్తే బాగుండేది. అలా కాకుండా క్లోజ్డ్ డోర్ ఫంక్షన్ ను నిర్వహించడం వల్ల ఆదాయం వుంటుందేమో కానీ జనాలకు ఉపయోగం వుండదు. ఆహా సంస్థ తన చందాదారులను పెంచుకోకోవచ్చు. అయితే ఇది అవార్డుల ఫంక్షన్ నా, షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నా? అన్న క్లారిటీ వస్తే 2500 ఖర్చు చేయడానికి జనం జంకుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?