ముఫై నిమషాలు కోసేసారు

అరణ్య సినిమా సెన్సారు సర్టిఫికెట్ స్క్రీన్ మీద చూడగానే అమ్మో ఇంత నిడివినా అని అనుకుంటారు అంతా. రెండున్నర గంటల పైమాట. కానీ ఆ డాక్యుమెంటరీ టైపు సినిమా చూడడంలో బోరింగ్ గా వుండి…

అరణ్య సినిమా సెన్సారు సర్టిఫికెట్ స్క్రీన్ మీద చూడగానే అమ్మో ఇంత నిడివినా అని అనుకుంటారు అంతా. రెండున్నర గంటల పైమాట. కానీ ఆ డాక్యుమెంటరీ టైపు సినిమా చూడడంలో బోరింగ్ గా వుండి రెండున్నర గంటలకు పైగా సినిమా చూసేసాం అనుకుంటారు. 

కానీ విషయం వేరు. దాదాపు ముఫై నిమషాల సినిమా కట్ చేసేసారు అని బోగట్టా. తెలుగు వెర్షన్ పంపిణీ చేసిన సురేష్ బాబు, రానా ముందుగానే సినిమా చూసి, ఇలా అయితే లాభం లేదని ముఫై నిమషాల సినిమా లేపేసారని తెలుస్తోంది. 

ముఖ్యంగా ఇంకో హీరో విష్ణు విశాల్ సీన్లు చాలా వరకు అందులో లేపేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రానా అర్జెంట్ గా ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పన్ కోషియమ్ సినిమా షూటింగ్ కు ఓ రోజు డుమ్మా కోట్టి మరీ మంబాయి వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. 

సినిమా విడుదలకు ముందే రామానాయుడులో కొంతమంది సురేష్ బాబు ఆశ్రితులకు సినిమా వేసి సోషల్ మీడియాలో హడావుడి చేయిద్దాం అనుకున్నారు. కానీ ఆ జనాలు కూడా సినిమా చూసి సైలంట్ అయిపోయారు. మర్నాడు మార్నింగ్ మరి కొందరికి వేసారు. వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఏ హడావుడి చేయలేకపోయారు. మొత్తం మీద అరణ్య అలా అయిపోయింది.