సినిమాల్లో బ్రాహ్మిన్ క్యారెక్టర్లను పెట్టడం వాటిని చులకన చేయడం అన్నది సినిమా జనాలకు బాగా అలవాటు. చాలా సార్లు దీని మీద ఆందోళనలు జరిగాక కాస్త తగ్గింది.
ఈవారం విడుదలైన రంగ్ దే సినిమాలో కూడా దర్శకుడు వెంకీ అట్లూరి అలాంటి ప్రయత్నమే చేసారు. వెన్నెల కిషోర్ కు అడవి శాస్త్రి అని ఇంటి పేరుతో సహా పేరు పెట్టి, బకరా క్యారెక్టర్ గా వాడుకున్నారు.
నిజానికి ఆ క్యారెక్టర్ కు ఇంటిపేరుతో సహా శాస్త్రి అని పెట్టాల్సిన పని లేదు. ఏదో ఒక పేరు పెడితే చాలు. సరే, ఏదో ఫన్ కోసం చేసారు అనుకుంటే ఓ సీన్ లో డైనింగ్ టేబుల్ వద్ద, సదరు శాస్త్రి క్యారెక్టర్..చికెన్ లేదా..ఓ ఇక్కడ దాచారా?అంటూ గిన్నె అందుకుంటాడు.
దీనికి ఏమనాలి? హాస్యం అనాలా? లేక వెంకీ అట్లూరి కావాలని చేసింది అనుకోవాలా? ఇదే మరే కమ్యూనిటీ విషయంలో అయినా ఇలా చేయగలరా?