చాలా సినిమా ఫంక్షన్ లకు పిలిస్తే వెళ్లడం జరుగుతుందటుందని, కానీ తొలిసారి అర్జున్ సురవరం ఫంక్షన్ కు తనంతట తానే వస్తాను అని చెప్పి వచ్చానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అలా అని ఈ ఖర్చు తన ఖాతాలో వేయవద్దని ఆయన చమత్కరించారు.
నిఖిల్ గురించి మాట్లాడుతూ, 'తనకు ఏజ్ ఎక్కువయిందని అనుకుంటున్నాడేమో, మతిమరుపు వచ్చిందనుకుంటున్నాడేమో, నా చెవిలో 'నిఖిల్' అని చెబుతున్నాడని కానీ అతని పేరు నిఖిల్ సిద్దార్ధ అని నాకు తెలుసు అని చిరు మరో చెణుకు విసిరారు.
తనకు మనుషులతో అనుబంధాలు పెంచుకోవడం ఇష్టం అని, నిఖిల్ కూడా ఇప్పుడు తోడై, తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని అంటూ, డబ్బులు ఎప్పుడు పంపిస్తావ్ అంటూ నిఖిల్ ను మరోసారి కార్నర్ చేసారు. మళ్లీ ఆయనే ప్రేమ రూపంలో పంపు అని సవరించారు.
ఈ సినిమాలో చెగువీరా మీద పాట వుందని, ఆ పాట చూసినపుడు తనకు ఎవరు గుర్తు వచ్చారో తెలుసా అంటూ ఆయన కూడా కాలర్ లోపల చేయిపెట్టి పవన్ కళ్యాణ్ ను గుర్తు చేసారు.
టాగోర్ మధు, ఆకెళ్ల రాజ్ కుమార్ లతో తనకున్న బంధం ఎనాటిదో అని, అయిన వాళ్లు రమ్మనమని తనను అడగరుఅని, వాళ్లకు అంత మొహమాటం అని చిరంజీవి అన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలిన ఆయన ఆకాంక్షించారు.