సందీప్ కిషన్-నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లో విడుదలైన కామెడీ సినిమా 'తెనాలి రామకృష్ణ'. బి సి సెంటర్ల ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేసిన ఈ సినిమాకు క్రిటిక్స్ అప్రిసియేషన్ అంతగా రాలేదు. అయితే సినిమాను చాలా రీజనబుల్ రేట్లకు విక్రయించడం మంచిదయింది.
ఆంధ్ర జస్ట్ కోటిన్నర రేషియోలో విక్రయించేసారు. నైజాం ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో దాదాపు అన్ని ఏరియాల్లో తొలివారం చాలా 90శాతం వరకు రికవరీ వచ్చింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఖర్చులు రావాలి.
విశాఖ ముఫై అయిదు లక్షలకు విక్రయించారు. 34 వరకు రికవరీ వచ్చింది. కృష్ణా 23 లక్షల వరకు రికవరీ వచ్చింది. నైజాం 65 లక్షలు, ఈస్ట్-వెస్ట్ కలిసి 43 లక్షలు, గుంటూరు 27 లక్షలు, నెల్లూరు 12, సీడెడ్ 40 లక్షలు వచ్చింది. మొత్తం మీద కర్ణాటక, తమిళనాడు అన్నీ కలుపుకుంటే 2.72 కోట్ల వరకు రికవరీ వచ్చింది.
నిర్మాతలు విడుదలకు ముందే సేఫ్ అయిపోయారు. ఎందుకంటే నాన్ డిజిటల్, హిందీ అన్నీ కలిపి నాలుగున్నర కోట్ల వరకు రికవరీ వచ్చింది. థియేటర్ రైట్స్ రెండు కోట్లు వచ్చాయి. సినిమాకు అయిదున్నర కోట్ల వరకు ఖర్చు చేసారు.