సినిమా లేట్.. హిందీ బేరం అవుట్

సకాలంలో వస్తే దాని సంగతే వేరు. లేట్ అయినా లేటెస్ట్ అనడానికి పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అయితే ఓకె.  Advertisement కొత్త హీరోలు, చిన్న హీరోలు అయితే అసలు అమ్ముడు పోవడం కష్టం.…

సకాలంలో వస్తే దాని సంగతే వేరు. లేట్ అయినా లేటెస్ట్ అనడానికి పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు అయితే ఓకె. 

కొత్త హీరోలు, చిన్న హీరోలు అయితే అసలు అమ్ముడు పోవడం కష్టం. తీరా చేసి అమ్మిన తరువాత సకాలంలో రాకపోతే బేరం పోవడం కూడా కామన్. ఓ పెద్ద సంస్థ నుంచి, ఆ సంస్థ వారసుడిగా వస్తున్న సినిమా ఎప్పటి నుంచో వార్తల్లోనే వుంటూ వస్తోంది. ఇప్పటికి మహా అయితే యాభై శాతం పూర్తయి వుంటుందని అంచనా.

ఈ సినిమా హిందీ హక్కులు ప్రారంభంలోనే అమ్మేసారు. మామూలుగా అయితే చిన్న హీరో సినిమా హక్కులు అంత త్వరగా అమ్ముడుపోవు. కానీ బ్యాకింగ్, బ్యానర్ దన్ను వల్ల అమ్ముడు పోయాయి. కానీ సినిమా ఎప్పటికీ పూర్తి కాకపోవడంతో, హిందీ రైట్స్ కొన్నవాళ్లు వెనక్కు వెళ్లిపోయారట. సినిమా వద్దని అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారట.

అయితే కొత్త హీరో సినిమా కనుక మరీ భయంకరమైన మొత్తం ఏమీ ఆఫర్ చేసి వుండరు. మహా అయితే అయిదు కోట్లు లోపే వుంటుంది. పెద్ద సంస్థ కనుక దీన్నేమీ పెద్దగా పట్టించుకోదు. కానీ ఒక్క సినిమా చేసిన హీరో, చకచకా ప్లాన్డ్ గా సినిమాలు చేయాలి. లేటు చేసుకుంటే కష్టమే.