సినిమా స్టార్ట్ కాకుండానే కోటి ఖర్చు

సినిమా పనులు ఇలాగే వుంటాయి. సినిమా పట్టాలు ఎక్కే వరకు అనుమానమే. కానీ అలా అని ప్రారంభ ఖర్చులు తప్పవు. వాటికి వడ్డీలు తప్పవు. సినిమా పట్టాలు ఎక్కి, విడుదలకు రెడీ అయితే ఇవన్నీ…

సినిమా పనులు ఇలాగే వుంటాయి. సినిమా పట్టాలు ఎక్కే వరకు అనుమానమే. కానీ అలా అని ప్రారంభ ఖర్చులు తప్పవు. వాటికి వడ్డీలు తప్పవు. సినిమా పట్టాలు ఎక్కి, విడుదలకు రెడీ అయితే ఇవన్నీ ప్రొడక్షన్ కాస్ట్ కిందకు వస్తాయి. లేదూ.. సినిమా అబేయన్స్ లో పడినా, ఆగినా చేతి చమురే. 

మెగాస్టార్ కుమార్తె తన తండ్రితో సినిమా తీయాలనుకున్నారు. రచయితను చూసుకున్నారు. కథ విన్నారు. ఓకె అనుకున్నారు. కానీ దానికి వేరే వాళ్లతో లింక్ వుండడంతో అవన్నీ వదిలించుకున్నారు. వేరే డైరక్టర్ తో లింక్ వుండడంతో అవన్నీ సెట్ చేసుకున్నారు.

ఆఖరికి కళ్యాణ్ కృష్ణ ను డైరక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. భోళాశంకర్ దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు స్వంత సినిమా తీస్తే మార్కెట్ ఎలా వుంటుందో తెలియదు. దాంతో ప్రాజెక్ట్ మొత్తం పక్కన పెట్టారు. యువి సంస్థతో భారీ సినిమా కు ఓకె చెప్పారు. కానీ తీరా చేస్తే ఇలా ప్రస్తుతానికో, పర్మినెంట్ గానో పక్కన పెట్టిన సినిమా ప్లానింగ్ కు అయిన ఖర్చు కోటి రూపాయిలు తేలిందట.

దీంట్లో ఎక్కువ భాగం ఆ సినిమాకు కథ పట్టుకువచ్చిన రచయితకు వున్న బంధాలు సెటిల్ చేయడానికే అయిందట. దాంతో కాస్త ఆగ్రహంగానే ఆ రచయితను వెనక్కు పంపేసి, ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి స్టోర్ రూమ్ లో వుంచేసారని తెలుస్తోంది. ప్రస్తుతానికి పాజ్ బటన్ నొక్కిన ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ లో మళ్లీ పట్టాలు ఎక్కుతుందేమో చూడాలి.