పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వున్న విపరీతమైన ప్రజాదరణకు మేజర్ రీజన్ ఆయన సినిమాలు. ఆయనకు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్. పవన్ ఆదాయ మార్గం కూడా అదే. అందుకే వాటిని వదులుకోవాలని పవన్ అనుకోవడం లేదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్ నెలలో రాజకీయ వ్యవహారం తాకిడి తగ్గిన తరువాత పవన్ సినిమాల మీద దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు హరి హర వీరమల్లు నిర్మాత ఎఎమ్ రత్నం కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
నాలుగు తరువాత డేట్ చెబుతారు.. అప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సి వుంటుంది అన్నది హరి హర వీరమల్లు యూనిట్ కు అందిన సమాచారం అని తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఓజి సినిమాను కూడా పవన్ పూర్తి చేయాల్సి వుంది. దానికి జస్ట్ 15 నుంచి 20 కాల్ షీట్లు కేటాయిస్తే చాలు. అందుకే ఆ సినిమాకు విడుదల డేట్ కూడా వేసి వుంచింది యూనిట్.
కానీ దానికి సమస్య ఏమిటంటే డిజిటల్ అమ్మకాలు జరగకపోవడం. ఓటిటి సంస్థలు ఈ ఏడాదికి సంబంధించిన స్లాట్ లు అన్నీ ఫిల్ చేసుకున్నాయని తెలుస్తోంది. కొనుగోలు చేసినా, మళ్లీ వచ్చే ఏడాదిలోనే ఓటిటిలో ప్రసారం చేసే అవకాశం వుంటుంది. అందువల్ల ఓజి సినిమా అర్జంగా పూర్తి చేసే అవకాశం తక్కువ. లేదా నెలకో వారం రోజుల వంతున మూడు నెలలు కేటాయించే అవకాశం వుంది.
అటు గెలిస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా విధులు నిర్వర్తించాల్సి వుంటుంది. అధికారం అందితే, మంత్రిగా మారితే ఆ పనులు కూడా వుంటాయి. అవి అన్నీ చూసుకుంటే నెలకో వారం వంతున సినిమాలకు కేటాయించాల్సి వుంటుంది. ఆ విధంగా ఈ ఏడాది హరి హర వీరమల్లు, ఓజి సినిమాలు పూర్తి చేసే అవకాశం వుంది.