భలేగా మెరిసిన కలర్ ఫొటో

కొన్ని సినిమాలకు టైమ్ బాగా కలిసొస్తుంది. అలా మంచి టైమ్ లో వచ్చిన మూవీ కలర్ ఫొటో. ఇప్పటికే ఓటీటీలో ఓ మోస్తరు రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా, బుల్లితెరపై కూడా భేష్ అనిపించుకుంది.…

కొన్ని సినిమాలకు టైమ్ బాగా కలిసొస్తుంది. అలా మంచి టైమ్ లో వచ్చిన మూవీ కలర్ ఫొటో. ఇప్పటికే ఓటీటీలో ఓ మోస్తరు రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా, బుల్లితెరపై కూడా భేష్ అనిపించుకుంది. ఇతర ఛానెల్స్ తో పెద్దగా పోటీ లేకపోవడం, స్టార్ ఎట్రాక్షన్ సినిమాలు బరిలో లేకపోవడం వల్ల కలర్ ఫొటో సినిమాకు మంచి టీఆర్పీ వచ్చింది.

స్టార్ మా ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేసిన ఈ సినిమాకు 6.27 రేటింగ్ వచ్చింది. ఈ వీక్ రేటింగ్స్ లో మూవీస్ సెగ్మెంట్ లో ఈ సినిమాదే పైచేయి. విశ్వక్ సేన్ నటించిన ఫ్లాప్ మూవీ పాగల్ కు కలర్ ఫొటో కంటే తక్కువ రేటింగ్ వచ్చింది.

సుహాస్-చాందిని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా ఆకట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి-తెల్లమ్మాయి కాన్సెప్ట్ కు, కులాంతరం, ధనిక-పేద యాంగిల్స్ కూడా యాడ్ చేసి తీసిన ఈ సినిమాకు 6కి పైగా టీఆర్పీ అంటే మంచి రేటింగ్ కిందే లెక్క.

'తరగతి గది' అనే సూపర్ హిట్ సాంగ్ ఈ సినిమాలోనిదే. దీనికితోడు కొన్ని డైలాగ్స్, హార్ట్ టచింగ్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

ఇక ఈ వారం కూడా ఎప్పట్లానే రేటింగ్స్ లో స్టార్ మా హవా కొనసాగింది. టాప్-10లో ఈ ఛానెల్ కార్యక్రమాలే నిలవగా.. మరోసారి మొదటి 5 స్థానాల్లో కార్తీకదీపం సీరియల్ నిలిచింది. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లో కూడా స్టార్ మా ఛానెల్ దే అగ్రస్థానం.