cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

క‌మెడియన్‌ సుదర్శన్ క్ష‌మాప‌ణ‌

క‌మెడియన్‌ సుదర్శన్ క్ష‌మాప‌ణ‌

నోరు అదుపులో పెట్టుకోవాల‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఎందుకంటే నోరు జారితే మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోలేరు. మాట‌ల విలువ తెలిసిన వాళ్లు నోటిని పొదుపుగా వాడుతారు. క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్ అత్యుత్సాహానికి వెళ్లి నోరు జారాడు. దీంతో అత‌ను ట్రోల్స్‌కు గురి కావాల్సి వ‌చ్చింది. చివ‌రికి త‌న త‌ప్పేంటో తెలుసుకుని క్ష‌మాప‌ణ చెప్పాడు. అస‌లేం జ‌రిగిందంటే...

బిగ్‌బాస్ వారాంత‌పు ఎపిసోడ్‌లో క‌మెడియ‌న్ సుద‌ర్శ‌న్‌, పాల్గొన్నాడు. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన ‘అనుభవించు రాజా’.ప్ర‌మోష‌న్‌లో భాగంగా బిగ్‌బాస్ షోలో చిత్ర యూనిట్ సంద‌డి చేసింది. సుద‌ర్శ‌న్‌తో పాటు రాజ్‌త‌రుణ్‌, హీరోయిన్ క‌షికాఖాన్ కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొని కంటెస్టెంట్స్‌తో ముచ్చ‌ట్లు చెప్పుకున్నారు. హౌస్‌మేట్స్‌పై త‌మ‌దైన శైలిలో రాజ్‌త‌రుణ్‌, సుద‌ర్శ‌న్ పంచ్‌లు వేశారు.

ఈ సందర్భంగా వీజే సన్నీ, ఆర్జే కాజల్‌ గురించి సుదర్శన్ నోరు జారారు. కాజల్‌ గురించి చెప్పమని సుదర్శన్‌ను నాగార్జున కోర‌గా... ‘కాజల్‌ చాలా బాగా ఆడుతున్నారు. మీరు అలిగినప్పుడు సన్నీ వచ్చి ఓదార్చడం అదో టైపు రొమాన్స్‌ బాగుంది’ అని అన్నాడు. దీంతో సన్నీ, కాజల్ షాక్ తిన్నారు. ఎందుకంటే వాళ్లిద్ద‌రి మ‌ధ్య అలాంటి బాండింగ్ లేద‌ని వీక్ష‌కుల‌కు బాగా తెలుసు. ఏదో ఒక‌టి మాట్లాడాల‌నే ఉత్సుక‌త‌తో త‌ప్పుడు సంకేతాలు పంపేలా సుద‌ర్శ‌న్ మాట్లాడ్డంపై స‌హ‌జంగానే నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

సన్నీ, కాజల్‌ అనుబంధం గురించి త‌న వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో  విమర్శలు వెల్లువెత్తాయి. ‘పెళ్లి అయిన‌ అమ్మాయి గురించి ఎలా మాట్లాడాలో తెలియదా’, ‘నిజంగా నువ్వు షో చూస్తున్నావా? వాళ్లిద్దరూ మంచి స్నేహితులు’ అంటూ నిల‌దీత‌లు, హిత‌బోధ‌ల కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ  నేప‌థ్యంలో సుద‌ర్శ‌న్ త‌న త‌ప్పును స‌రిదిద్దుకునేందుకు ముందుకొచ్చారు. త‌న‌కు ఎంతో మంది మెసేజ్‌లు పంపుతున్నార‌ని, అంద‌రికీ స‌మాధానంగా వీడియో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

‘ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌ షో చూసి చాలా సందేశాలు వచ్చాయి. ‘మీరిలా మాట్లాడితే వాళ్లు ఎలా ఆడతారు’ అంటూ వరుసగా మెస్సేజ్‌లు చేస్తున్నారు. బ్రదర్‌.. మేము సరదాగా చాలా సేపు మాట్లాడుకున్నాం. కానీ, ఎడిటింగ్‌లో మొత్తం పోయి, ఐదు నిమిషాలే వచ్చింది. వీడియో చూడటం వల్ల అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. 

సన్నీ-కాజల్‌ రిలేషన్‌ గురించి తండ్రీ-కూతుళ్ల నుంచి సిస్టర్‌ బ్రదర్‌ వరకూ సాగింది. మేమంతా కామెడీగా మాట్లాడుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. కానీ, బయటకు వచ్చిన వీడియో వల్ల నెగెటివ్‌గా అనుకుంటున్నారు. నా తరపున సన్నీని అభిమానించే వాళ్లకు, కాజల్‌, ఆమె కుటుంబ సభ్యులకు క్షమాపణ చెబుతున్నా’ అని సుద‌ర్శ‌న్ చెప్పుకొచ్చారు. సుద‌ర్శ‌న్‌ను క్ష‌మిస్తార‌ని ఆశిద్దాం.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!