గని లాంటి సినిమా చేసి షాక్ కొట్టించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేసి హిట్ లు కొట్టాడు.
దాంతో కాస్త అర్థం అయింది..జనాలకు ఫన్ అందిస్తే మినిమమ్ గ్యారంటీ వుంటుందని. అందుకే ఇప్పుడు కామెడీ కథల కోసం చూస్తున్నాడట. ఎవరైనా కథలు చెప్పడానికి వస్తే ఫన్ స్టోరీస్ ప్లీజ్ అంటున్నాడట.
సీరియస్ కథ ఇప్పట్లో వద్దు. కామెడీయే ముద్దు అంటున్నాడట. ఐడియా బాగానే వుంది. కానీ కేవలం వరుణ్ తేజ్ మీద కామెడీ అంటే పండాలి కదా? ఎఫ్ 2, ఎఫ్ 3 అనేవి ఫన్ ప్యాకేజ్ లాంటి సినిమాలు. అందులో వెంకటేష్, తమన్నా, మెహరీన్, సునీల్ ఇలా అందరూ ఎవరి లెవెల్ లో వాళ్లు కామెడీ చేస్తే వ్యవహారం నడిచింది.
కానీ ఇప్పుడు కేవలం వరుణ్ తేజ్ మీద కామెడీ పండించాలంటే డైరక్టర్ కు చాలా టాలెంట్ వుండాలి. అలాంటి డైరక్టర్..అలాంటి కథ దొరకాలన్నమాట వరుణ్ తేజ్ కు.