జగన్ నిర్ణయం భేష్ అంటున్న స్వామీజీ

రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకు ఊరటను ఇచ్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయిదు లక్షల లోపు ఆదాయం వచ్చే దేవాలయాలకు ఇక మీదట ఏ రకమైన దేవాదాయ శాఖకు ఫీజు చెల్లించాల్సిన అవసరం…

రాష్ట్రంలో ఉన్న అనేక దేవాలయాలకు ఊరటను ఇచ్చే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయిదు లక్షల లోపు ఆదాయం వచ్చే దేవాలయాలకు ఇక మీదట ఏ రకమైన దేవాదాయ శాఖకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కీలక నిర్ణయం వెలువడింది.

దీని వల్ల రాష్ట్రలో పెద్ద ఎత్తున ఉన్న ఆలయాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటిదాకా కామన్ గుడ్ ఫండ్స్ కోసం తొమ్మిది శాతంగా దేవాదాయ శాఖకు ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. అదే విధంగా దేవాదాయ శాఖ నిర్వహణ నిధికి మరో ఎనిమిది శాతం, ఆడిట్ కి 1.5 శాతం ఫీజుగా చెల్లించాల్సి వచ్చేది.

దీని వల్ల అణగారిన ఆలయాలు, పెద్దగా ఆదాయనికి నోచని ఆలయాలు ఇబ్బందులు పడేవి. ఇపుడు ఏకంగా అయిదు లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలకు మినహాయింపు ఇవ్వడం సముచిత నిర్ణయం విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర మహా స్వామి హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంలో చాలా చిన్న ఆలయాలు బతికి బట్టకడతాయని, వాటిలో ధూప దీప నైవేద్యాలకు కూడా ఇబ్బందులు ఉండవని స్వామీజీ అభిప్రాయపడ్డారు. 

మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ అర్చక సమాఖ్య కూడా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం గొప్పదని పేర్కొంది. దీని వల్ల అర్చకుల జీతాలకు సంబంధిచి ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది.