Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆదిపురుష్ కు రెండో ఎదురుదెబ్బ

ఆదిపురుష్ కు రెండో ఎదురుదెబ్బ

టీజర్ రిలీజ్ చేసినప్పుడే ఆదిపురుష్ పై విమర్శలు చెలరేగాయి. హనుమంతుడికి ఇచ్చిన దుస్తులు, రావణాసురుడికి ఇచ్చిన వాహనంపై తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో ఆ గ్రాఫిక్స్ మార్చేందుకు, విడుదలను వాయిదా వేసింది యూనిట్. అలా మరోసారి గ్రాఫిక్స్ మార్చి సినిమాను సిద్ధం చేసింది ఆదిపురుష్ యూనిట్.

శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ్టి నుంచి మరోసారి ప్రచారాన్ని పునఃప్రారంభించింది. అయితే ఈసారి కూడా టీమ్ కు ఎదురుదెబ్బలు తప్పలేదు. విమర్శలు తగ్గలేదు.

ఈరోజు సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రామాయణ ఘట్టానికి చెందిన ఐకానిక్ పోస్టర్ ను తమదైన శైలిలో ఆవిష్కరించారు. సరిగ్గా ఇక్కడే యూనిట్ పై మరోసారి విమర్శలు చెలరేగాయి.

రామాయణం అనగానే ఎవరికైనా పైన చూపించిన పోస్టర్ లో రాముడు-సీత-లక్ష్మణుడి గెటప్పులు గుర్తొస్తాయి. తెలుగు ప్రేక్షకులు చూసిన పాత సినిమాల్లో కూడా గెటప్పులు దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీనికి పూర్తి భిన్నంగా ఉంది ఆదిపురుష్ పోస్టర్. రాముడికి తలపై కిరీటం లేదు. పైపైచ్చు అతడికి ఇచ్చిన దుస్తుల్లో, లుక్స్ లో సాత్వికం కనిపించలేదు.

ఇక సీత లుక్ పై రాముడి లుక్ కంటే ఎక్కువగా విమర్శలు చెలరేగుతున్నాయి. ఆమెకు ఓ శాలువ లాంటిది కప్పడం విమర్శలకు తావిస్తోంది. అటు లక్ష్మణుడి పాత్రలో కూడా భక్తిభావం కాకుండా, వీరత్వం కనిపిస్తోంది. అతడికిచ్చిన దుస్తులు కూడా లెదర్ ను పోలి ఉన్నాయి.

ఇలా ఆదిపురుష్ కొత్త పోస్టర్ పై ఓ రేంజ్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిపురుష్ సినిమాను చూడాలనుకుంటే, ఈ గెటప్స్ కు అలవాటు పడాల్సిందే అన్నట్టుగా ఇలా ముందుగా పోస్టర్ రిలీజ్ చేసినట్టుంది.

సినిమాలో ప్రభాస్ ను రాఘవ్ గా, కృతి సనన్ జానకిగా సంబోధించనున్నారు. ఓంరౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయబోతున్నారు. ఈసారి గ్రాఫిక్స్ తో పాటు, రిలీజ్ డేట్ మార్చే ఉద్దేశం యూనిట్ కు లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?