క‌న్న‌డ‌, త‌మిళ‌నాట రచ్చలేపిన ‘పెరుగు’ వివాదం!

చాలాకాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ఉత్తరాది శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒకే బాష‌, ఒకే పార్టీ, ఒకే వ్యాపార వ‌ర్గం అనే…

చాలాకాలంగా దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ఉత్తరాది శక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒకే బాష‌, ఒకే పార్టీ, ఒకే వ్యాపార వ‌ర్గం అనే దిశ‌గా పావులు క‌దుపుతునే ఉంది. తాజాగా దక్షిణాది భాష‌ల‌పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకుంది.

తమిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లో నందిని పెరుగు ఫ్యాకేట్ల‌పై ప్రధానంగా హిందీ పదం 'దహీ' అని వాడాలని .. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఆదేశించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. కావాలనుకుంటే ప్రాంతీయ భాషలో పక్కన బ్రాకెట్లలో పెట్టుకోవచ్చునని దయదలచి అనుమతించింది. 'ద‌హీ' ప‌దం సృష్టంగా ముద్రిస్తూ క‌న్న‌డ‌లో 'మెస‌రు', త‌మిళంలో 'తైర్' ప‌దాల‌ను బ్రాకెట్ లో వాడాల‌ని సృష్టం చేసింది. 

దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తున్నారని హిందీవాదులపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  క‌న్న‌డ ప్ర‌జ‌లు కూడా కేంద్ర నిర్ణ‌యంపై మండిప‌డుతున్నారు. ప్రాంతీయ భాషలను చంపే కుట్రతోనే ఇలా పదేపదే హిందీ పేరుతో అవమానిస్తున్నారని పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.