పగటి సెక్స్ తో రాక్షసులు పుడతారని పురాణాల్లో ఎక్కడో పేర్కొన్నారట! ముహూర్తం చూసి గర్భాదానం చేయడం మీద నమ్మకాల సంగతేమో కానీ.. అయితే శృంగారం అంటే కేవలం పిల్లలను కనడం కాదు కదా! సెక్స్ కు పగటి సమయానికి మించినది మరోటి లేదని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషి జీవన శైలిలో శృంగారం అనేది రాత్రిపూటే అనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నా.. శృంగారానికి శరీర సహకారం పగటి పూట ఉన్నంత స్థాయిలో రాత్రి పూట ఉండకపోవచ్చని కూడా సెక్స్ థెరఫిస్టులు చెబుతున్నారు.
పిల్లలు కలిగిన వారికి పగలేనా!
చిన్న పిల్లలు అయినా, ఎదుగుతున్న పిల్లలైనా.. తమ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు. ప్రత్యేకించి వారికి నిద్రపట్టేంత వరకూ! పిల్లలను వేర్వేరు గదుల్లో నిద్రపుచ్చేంత సంప్రదాయం ఉన్న వారి సంగతేమో కానీ, పిల్లలకు భయపడి శృంగార ఆలోచనలను కట్టడి చేసుకునే వారెంతో మంది ఉంటారు! ఇలా సంతానం కలిగిన జంటలకు శృంగారానికి పగటికి మించిన అవకాశం ఉండదు! పిల్లలు నిద్రపోయేంత వరకూ ఎదురుచూసే ఓపిక ఉన్న వారి సంగతి వేరే!
ఎక్కువ ఎనర్జీ!
పగలంతా వృత్తితోనో, ప్రవృత్తితోనో బిజీగా గడిపి శారీరకంగా అలిసిపోతారు ఎవరైనా. ఇలాంటి అలసటతో ఇంటికి వచ్చి భోజనం చేశాకా నిద్రకు మించిన సుఖం ఉండదు. ఇలాంటి సమయంలో శృంగార కోరికను తీర్చుకునే ప్రయత్నం చేసినా.. ఈ ఎనర్జీ లెవల్స్ నిద్రలేచాకా తెల్లవారుజామునో, ఉదయాన్నేనో ఉండే ఎనర్జీతో మ్యాచ్ కావని సెక్స్ థెరఫిస్టులు చెబుతున్నారు. అది వేరే లెవల్ అని అంటున్నారు!
టెస్టోస్టిరాన్ స్థాయి పెరుగుతుంది!
మనిషిని సెక్స్ వైపుకు ఆలోచనలను కలిగించే టెస్టోస్టినరాన్ లెవల్స్ ఉదయం పూటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి పూట కంటే ఉదయానికి టెస్టోస్టిరాన్ లెవల్స్ మంచి స్థాయిలో ఉంటాయని దీంతో అప్పుడు శృంగారం మంచి అనుభవం కావొచ్చని చెబుతున్నాయి.
ఉదయం పూట ఉండే రిఫ్రెష్ నెస్!
ఉదయం లేవగానే అన్ని విధాలుగానూ ఫీలయ్యే ఈ రిఫ్రెష్ నెస్ శృంగారానికి ఆస్వాధననకు కూడా ఉపకరిస్తుందనేది అధ్యయనాల మాట.
ఇద్దరే ఏకాంతంగా గడపగల సమయం!
అది బెడ్ రూమ్ లోనే అయినా.. రాత్రిపూట కన్నా తెల్లవారుజామునో, ఉదయాన్నేనో కాస్త ఎక్కువ ఏకాంతం దొరకవచ్చు. ఈ విషయం దంపతులకే బాగా అర్థం కావొచ్చు.
మంచి ఆరంభం!
ఒక రోజును ప్రారంభించడానికి శృంగారానికి మించిన సానుకూలాంశం ఉండదని వేరే చెప్పనక్కర్లేదు. మంచి సెక్స్ అనుభం ఆ రోజును మధురంగా మార్చవచ్చు!
వాక్ తర్వాత, ఏకాంత సమయం!
మార్నింగ్ వాక్ గనుక చేసే అలవాటు ఉంటే, సెక్స్ లో చాంఫియన్లుగా నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టే అని మరో అధ్యయనం చెబుతోంది. ఉదయం పూట వాక్ తో శరీరంలో హార్మోనల్, కెమికల్ రియాక్షన్ తో శృంగారేచ్ఛ బాగా పెరుగుతుందని ఇది వివరిస్తోంది. మార్నింగ్ వాక్ తర్వాత ఏకాంత సమయం దొరికే అవకాశం ఉన్నప్పుడు శృంగారం ప్రత్యేకం అవుతుందని చెబుతోంది.
ఓరల్ క్లీన్ నెస్!
ఉదయం పూట శృంగారం పట్ల ఉత్సాహం ఉన్నప్పుడు ఓరల్ క్లీన్ నెస్ ను మాత్రం మరిచిపోకూడదని థెరఫిస్టులు చెబుతున్నారు!