చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎన్నికలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో 'మా' ఎన్నికలను హీటెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు 'మా' సభ్యులు తాజా పరిణామాలపై స్పందించారు. టాలీవుడ్‌లో నెలకున్న ఈ ధోరణిపై వారి మాటల్లో ఆందోళన వ్యక్తమైంది.
'మా' సభ్యుడు బాబు మాట్లాడుతూ 'మా' అసోసియేషన్‌లో అసలు వివాదాలకు కారణాలపై లోతుగా అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే తమ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు ఆరోపణలు చేసిన నటి హేమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ నెల 29న జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందన్నాడు. ఆరోజే ఎన్నికల తేదీ ఖరారు చేసే అవకాశ ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. మంచు విష్ణును ఏకగ్రీవంగా ప్రెసిడెంట్‌ని చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
'మా' సభ్యుడు మనిక్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఎన్నిల పరిణామాలపై జయసుధ, చిరంజీవి, మోహన్‌బాబు, కృష్ణంరాజుకు లేఖలు పంపిస్తామని చెప్పుకొచ్చారు.
ఇండియా, పాకిస్తాన్ తరహాలో 'మా' లో గొడవలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం, గత 25 ఏళ్ల కాలంలో ఎన్నడూ ఇలాంటి వివాదాలు చూడలేదని మనిక్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివాదాలు సృష్టిస్తున్న వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.