cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్రాస్ రోడ్స్ చరిష్మా క్లోజ్ అయిందా?

క్రాస్ రోడ్స్ చరిష్మా క్లోజ్ అయిందా?

హైదరాబాద్ క్రాస్ రోడ్స్ అంటే సినిమా అభిమానులకు కేరాఫ్ అడ్రస్ ఒకప్పుడు. మల్టీ ఫ్లెక్స్ లు రాకపూర్వం క్రాస్ రోడ్స్ లో సినిమా విడుదల అంటే పండగలా వుండేది. 

సినిమా హీరోలు కూడా మెయిన్ థియేటర్ లో సినిమా చూడడం అంటే కీలకంగా భావించేవారు. నిన్న మొన్నటి వరకు ఇదే వ్యవహారం వుండేది.  ప్రసాద్ మల్టీ ఫ్లెక్స్ వచ్చినా, ఐనాక్స్ లు పెరిగినా ఈ వ్యవహారంలో పెద్దగా మార్పురాలేదు. 

కానీ ఇటీవల ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాభవం తగ్గుతోందేమో అన్న చిన్న అనుమానం కలుగుతోంది. మల్టీ ఫ్లెక్స్ ల కారణంగా రాను రాను సింగిల్ స్క్రీన్ లకు ఆదరణ తగ్గుతోంది. ఎంత మోడరన్ గా చేసినా కూడా సింగిల్ స్క్రీన్ వేరు మల్టీ ఫ్లెక్స్ ఎక్స్ పీరియన్స్ వేరు.

అందుకే ప్రేక్షకులు మెలమెల్లగా క్రాస్ రోడ్స నుంచి మల్టీ ఫ్లెక్స్ ల బాట పడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి రోజు కూడా క్రాస్ రోడ్స్ లో ఫుల్స్ రావడం కష్టం అవుతోంది. సెకెండ్ థియేటర్ అయితే అసలు సమస్యే లేదు. చాలా తక్కువ ఆక్యుపెన్సీ వుంటోంది. దాదాపు గత మూడు నెలలుగా ఇదే తంతు కనిపిస్తోంది. 

సినిమా టాక్ వచ్చిన తరువాత వేరే సంగతి. విడుదల రోజు కూడా వ్యవహారం పెద్ద గొప్పగా వుండడం లేదు. చూస్తుంటే ఇక కొన్నాళ్లకు క్రాస్ రోడ్స్ వైభవం కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. 

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!