నాగ్ చైతన్య- వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చిట్టూరి శ్రీను నిర్మిస్తున్న కస్టడీ సినిమా ట్రయిలర్ విడుదలయింది. ఈ ట్రయిలర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు.
ఎందుకంటే దర్శకుడు వెంకట్ ప్రభుకు ఇది తెలుగులో తొలిసినిమా. ఇప్పటి వరకు వెంకట్ ప్రభు తీసిన సినిమాలు ఏవీ రొటీన్ కాదు. హిట్ అయ్యాయా, కాలేదా అన్నది పక్కన పెడితే డిఫరెంట్ గా వుంటాయి అనే పేరు వుంది. అందుకే కస్టడీ సినిమా మీద కూడా అదే తరహా ఆసక్తి.
ఓ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ కు, ఓ తెలివైన హార్డ్ కోర్ క్రిమినల్ కు మధ్య నడిచే కథ అని ట్రయిలర్ చెబుతూనే వుంది. కానీ కేవలం అది మాత్రమే కాకుండా మల్టిపుల్ లేయర్లు సినిమాలో వున్నట్లు ట్రయిలర్ స్పష్టం చేస్తోంది. ట్రయిలర్ కట్ బాగుంది. ఎక్కడా రిపీట్ లేదు. ఒకే సీన్ లోంచి రెండు మూడు కట్ లు చేసి, అక్కడా అక్కడా పేర్చిన దాఖలా లేదు. సినిమా కథ కాస్త పెద్ద స్పాన్ లోనే తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది.
కానీ ట్రయిలర్ కాస్త ప్లయిన్ గా వుంది. మరి సినిమాలో ప్రెజెంటేషన్ ఎలా వుంటుంది అన్నది చూడాలి. ఇళయరాజా నేపథ్యసంగీతం ఓకె . చైతన్య సటిల్డ్ పెర్ ఫార్మెన్స్ చేసాడు. అరవింద్ స్వామి గెటప్ పక్కా 420 టైపులో బాగుంది.