దానయ్య 30..బయ్యర్లు 50

ఆర్ఆర్ఆర్ రేట్ల పంచాయతీ తొలి సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలకు కలిసి 140 కోట్లకు విక్రయించారు. దీంట్లో యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు కోరుతున్నారు. దీనికి నిర్మాత…

ఆర్ఆర్ఆర్ రేట్ల పంచాయతీ తొలి సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఆంధ్ర, సీడెడ్ ఏరియాలకు కలిసి 140 కోట్లకు విక్రయించారు. దీంట్లో యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు కోరుతున్నారు. దీనికి నిర్మాత దానయ్య గతంలో ఇరవై శాతం తగ్గిస్తా అన్నారు. కానీ ఇప్పుడు ముఫై శాతం వరకు తగ్గించుకుంటా అని ముందుకు వచ్చారు. అంటే ఆయనకు దాదాపు 28 కోట్ల నష్టం అన్నమాట. 

అయితే బయ్యర్లు 50 శాతం మీదనే వుండడంతో, ఆఖరికి ఇప్పుడు దానయ్య 30 శాతం వరకు తగ్గించేందుకు అంగీకరించారు. అంటే 42 కోట్లు నష్టం అన్నమాట. కానీ బయ్యర్లు ఇంకా యాభై శాతం అయితేనే కిట్టుబాటు అవుతుందనే దగ్గరే ఆగిపోయారు. దాంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది. 

మరోసారి సమావేశమై మళ్లీ చర్చిస్తారని తెలుస్తోంది. పుష్ప సినిమా లెక్కల్లో చూసుకుంటే విశాఖ ఏరియాకు ఏడెనిమిది కోట్లు వసూలు చేసింది. దానికి రెట్టింపు చేస్తుంది అనుకున్నా, ప్రభుత్వం చూసీ చూడనట్లు రేట్లు వదిలేస్తుంది అనుకున్నా 15 కోట్లు మించడం కష్టం. ముఫై శాతం డిస్కౌంట్ అంటే 17 కోట్లు పైమాటే.

ఇదే రేషియో దాదాపు అన్ని ఏరియాలకు వుంది. అందుకే బయ్యర్లు 50 శాతం అనే దాని మీదే వున్నారు. మరి ఇది 35 శాతం దగ్గరో, 40 శాతం డిస్కౌంట్ దగ్గరో సెటిల్ అయ్యే అవకాశం వుందనుకోవాలి. మొత్తానికి ఆంధ్ర సిఎమ్ జగన్ పుణ్యమా అని ఆంధ్ర సినిమా ప్రేక్షకులకు దాదాపు యాభై కోట్లు మిగిల్చినట్లే.