cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

'దర్జా' గా విడుదలకు సిద్దం

'దర్జా' గా విడుదలకు సిద్దం

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా టీమ్ ను అభినందించారు. 

ప్రత్యేకంగా సునీల్,అనసూయ నటన హైలైట్ గా ఉందని, యాక్షన్ సన్నివేశాలలో వీరిద్దరి పోటాపోటీ నటన అద్భుతంగా ఉందని అన్నారు .అలాగే పృథ్వి, ఆమని, నాగమహేశ్ షకలక శంకర్ లు తమతమ పాత్రల మేరకు చాల చక్కగా నటించారని అభినందించారు.

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ " మా సినిమాను చూసి మా సినిమా బాగుందని ప్రశంసించిన సెన్సార్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమాపై వారిచ్చిన ఫీడ్ బాక్ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. సినిమాను ఇండస్ట్రీలో కొంతమందికి ప్రత్యేకంగా చూపించామని, తొందరపడి ఏదో ఒక డేట్ కు విడుదల చేసేయవద్దని, మంచి సినిమా అవుతుంది కనుక జాగ్రత్తగా రిలీజ్ ప్లాన్ చేయమని సూచించారు అన్నారు. 

అందువల్ల పబ్లిసిటీ ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా చేసి, మాంచి విడుదల డేట్ ను ఫిక్స్ చేసే పనిలో వున్నామన్నారు. ప్రస్తుతం బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే డేట్ ఫిక్స్ చేసి పబ్లిసిటీ స్టార్ట్ చేస్తామని ఆయన వెల్లడించారు.  

ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను సురేష్ బాబు, పాటలను రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని రవి పైడిపాటి తెలిపారు.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి