అడాన్స్ సేల్ అన్నది ఒక్కోసారి లాభం అవుతుంది. మరోసారి నష్టం అవుతుంది. టాలీవుడ్ లో కరోనాకు ముందే చేసిన కొన్ని అడ్వాన్స్ అమ్మకాలు నష్టమే అయ్యాయి. పుష్ప సినిమా నాన్ థియేటర్ ముందుగా అమ్మేసారు. దాని వల్ల వడ్డీలు లెక్కలు వేసుకుంటే ఏమో కానీ లేదంటే నష్టమే అయింది.
నిఖిల్ నటించి కార్తికేయ 2 సినిమాను పీపుల్స్ మీడియా ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం స్టార్ట్ చేసింది. భారీ సినిమా కావడంతోనూ, కరోనా కారణంగానూ టైమ్ పట్టింది. అయితే సినిమా స్టార్ట్ చేసిన వెంటనే నాన్ థియేటర్ ను 14 కోట్లకు అమ్మేసారు. అప్పట్లో ఎక్కువ రేట్లు లేవు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డిజిటల్, హిందీ రేట్లు బాగా పెరిగాయి. పైగా కార్తికేయ 2 కంటెంట్ రీజనల్ కంటెంట్ కాదు. ఏ లాంగ్వేజ్ కైనా నప్పే కంటెంట్. అందుకే నాన్ థియేటర్ కు ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏమీ చేయలేరు.
నిజానికి ఈ సినిమా 20 కోట్లలో ఫినిష్ చేసి వుంటే బాగుండేది. 15 కోట్లలో ఫస్ట్ కాపీ తీసి ఇస్తామనే ప్రపోజల్ తో రంగంలోకి దిగారు దర్శకుడు చందు మొండేటి. కానీ ముఫై కోట్లకు చేరింది.
ఈ సినిమాకు కాంబినేషన్ లెక్కలు చూసుకోకుండా 30 కోట్లు ఖర్చు చేసారు. దేశ విదేశాల్లోని లోకేషన్లలో షూట్ చేసారు. అనేక ఏరియాలకు వెళ్లారు. సిజి లకు బాగా ఖర్చు చేసారు.
ఇప్పుడు థియేటర్ మీద 16 కోట్లు రికవరీ కావాల్సి వుంది. హక్కులను ప్రయిమ్ ఫోకస్ సంస్థకు సింగిల్ పాయింట్ సేల్ కింద విక్రయించే దిశగా చర్చలు సాగుతున్నాయి.