నిర్మాతగా ఇన్నింగ్స్ ఆపేసినా, బండ్ల గణేష్ కు క్రేజ్ బాగానే వుంది. నిత్యం ట్విట్టర్ లో వుంటూ, అప్పుడప్పుడు చానెళ్లలో దర్శనమిస్తూ డిజిటల్ మీడియాలో క్రేజ్ ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
కానీ బండ్ల దగ్గర వున్న సమస్య ఏమిటంటే, ఎవరైనా ఏదైనా అడిగితే ‘నాకేంటీ’ అంటాడు. అదే సమస్య. ఈ మధ్యన ఓ దర్శకుడు ఓ క్యారెక్టర్ కు వన్ సింగిల్ డే డబ్బింగ్ చెప్పమని అడిగాడట. దానికి బండ్ల చెప్పిన రేటు విని మరి మాట్లాడలేదు.
విషయం ఏమిటంటే రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి మళ్లీ నటిస్తున్నాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పమని బండ్ల గణేష్ ను అడిగాడట హీరో శరత్ మండవ. సరే, ప్రొడక్షన్ వాళ్లను టచ్ లోకి రమ్మని బండ్ల చెప్పినట్లున్నాడు. వాళ్లు లైన్ లోకి వచ్చారు.
వర్క్ ఎన్ని రోజులు వుంటుందంటే వన్ డే అన్నారని బోగట్టా. అయితే అయిదు లక్షలు కావాలని బండ్ల అడిగినట్లు తెలుస్తోంది. దాంతో షాక్ అయిన యూనిట్ మరి బండ్ల జోలికి రాలేదు. అయినా వేణు తొట్టెంపూడి పోలీస్ క్యారెక్టర్ కు బండ్ల వాయిస్ ఎలా సెట్ అవుతుందని అనుకున్నాడో దర్శకుడు. లేదా వెరైటీగా వుంటుందని అనుకున్నారేమో?