దాసరి కొడుకుల మద్య ఆస్తి తగాదా

ప్రముఖ దర్శకుడు ,సినీ ప్రముఖుడు దివంగత దాసరి నారాయణ రావు కుమారులు ప్రభు, అరుణకుమార్ లు ఇద్దరూ ఆస్తుల గురించి గొడవ పడుతున్నారు. Advertisement తన ఇంటిలోకి అక్రమంగా చొరబడి అరుణకుమార్ తమపై దౌర్జన్యం…

ప్రముఖ దర్శకుడు ,సినీ ప్రముఖుడు దివంగత దాసరి నారాయణ రావు కుమారులు ప్రభు, అరుణకుమార్ లు ఇద్దరూ ఆస్తుల గురించి గొడవ పడుతున్నారు.

తన ఇంటిలోకి అక్రమంగా చొరబడి అరుణకుమార్ తమపై దౌర్జన్యం చేశారని ప్రభు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేశారు.

ప్రభు కొన్ని ఆస్తులు అమ్ముకుని ,తనకు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆయనఅన్నారు. తాను ఉంటున్న ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

అరుణకుమార్ ఇంటి గేటు దూకి లోపలకు వచ్చాడని ఆయన వివరించారు.ఆస్తుల విషయమై సినీ ప్రముఖులు మోహన్ బాబు, సి.కళ్యాణ్, మురళీమోహన్ లు స్పందించాలని ప్రభు కోరారు.