Advertisement

Advertisement


Home > Movies - Movie News

డేట్ల ముడి వీడుతోంది

డేట్ల ముడి వీడుతోంది

విడుదల తేదీలు తెలియక కిందా మీద అయిపోతున్నారు సినిమాలు పైప్ లైన్ లో వున్న వాళ్లు. ఇప్పటికే ఫిబ్రవరి వరకు చాలా సినిమాల డేట్ లు వచ్చేసాయి. ఇప్పుడు మరో మూడు సినిమాలు డేట్ లు కూడా ఖరారయినట్లే.

దాదాపు నెల రోజులుగా దాగుడుమూతలు ఆడుతున్న చైతన్య-వెంకటేష్ ల వెంకీ మామ సినిమా డేట్ దాదాపు ఖరారయిందని ఈ రోజు వార్తలు గుప్పుమన్నాయి. సోమవారం మధ్యాహ్నం సినిమా డేట్ ఎనౌన్స్ చేస్తారని ముందుగా ప్రకటించారు. కానీ లాస్ట్ మినిట్ లో రెండు రోజులు అవతలికి పోస్ట్ పోన్ చేసారు.

కానీ డిస్ట్రిబ్యూటర్ల గ్రూప్ లో మాత్రం డిసెంబర్ 13 విడుదల అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వెంకీ బర్త్ డే కు ఓ సినిమా కూడా ఇప్పటి వరకు రాలేదు. అందుకే ఈసారి వెంకీ మామ ను ఆ సినిమాకు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

చైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాను ఏప్రియల్ 2 కి ఫిక్స్ చేసారు. ఈ ఏడాది ఏప్రియల్ ఆరంభంలో మజిలీ సినిమా వచ్చి, సమ్మర్ ఓపెనింగ్ డేస్ ను క్యాష్ చేసుకుంది. మళ్లీ ఇఫ్పుడు కూడా అదే స్ట్రాటజీతో 2020 సమ్మర్ ఓపెనింగ్ సినిమాగా బరిలోకి దింపుతున్నారు.

ఇక అనుష్క లేటెస్ట్ సినిమా నిశ్శబ్ధం డేట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా కోసం కూడా భాగమతి సెంటి మెంట్ ను పాటిస్తూ, జనవరి 31ను డేట్ గా ఫిక్స్ చేసారు. ఇదే టైమ్ లో వచ్చి భాగమతి మాంచి హిట్ అయింది. అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేసారని అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?