దావూద్ ఇంటికి దారేది

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తన ఫన్ స్టామినాను పక్కాగా తెరపైకి తీసుకువచ్చాడు దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె. ఆ దర్శకుడి రెండో సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. మాట్నీ ఎంటర్ టైన్…

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తన ఫన్ స్టామినాను పక్కాగా తెరపైకి తీసుకువచ్చాడు దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జె. ఆ దర్శకుడి రెండో సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా ట్రయిలర్ ను హీరో మహేష్ బాబు విడుదల చేసారు. 

చరుకైన ముగ్గురు పిల్లలు అమాయకంగా ఓ పనిలో పడతారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ను పట్టుకుని యాభై లక్షలు సంపాదించాలన్నది వారి తెగింపు. ఇది ఒక యాంగిల్ కాగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తాప్సీ పొన్ను చేపట్టిన మరో మిషన్ ఇంకో యాంగిల్.

ఈ రెండింటినీ మిళితం చేస్తూ అల్లుకున్నకథలా కనిపిస్తోంది ట్రయిలర్. పిల్లల మీద ఫన్ డైలాగులు బాగానే పేలాయి. ఆర్జీవీ ఫొటొ అనుకుని దాచుకున్నా, మిషన్ త్రివిక్రమ్…దావూద్ ఇంటికి దారేది. రఘుపతి ..రాఘవ..రాజారాం..ఆర్ఆర్ఆర్…అలాగే కేజిఎప్ అంటే..వన్ నా టూ అని అడగడం ఇలా చాలా పంచ్ లు ట్రయిలర్ లో గట్టిగానే పేలాయి.

నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సినిమాకు నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది.