పాన్ ఇండియా అప్పీల్ కోసం…

హీరోకు పాన్ ఇండియా అప్పీల్ లేదు. డైరక్టర్ కు పాన్ ఇండియా అప్పీల్ లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి. కనీసం హీరోయిన్ గా అయినా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన…

హీరోకు పాన్ ఇండియా అప్పీల్ లేదు. డైరక్టర్ కు పాన్ ఇండియా అప్పీల్ లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి. కనీసం హీరోయిన్ గా అయినా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందిన అమ్మాయిని తీసుకోవాలి. రామ్-బోయపాటి సినిమాకు ప్రస్తుతం అదే జరుగుతోంది.

త్వరలోనే బోయపాటి దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు రామ్ పోతినేని. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రాజెక్టులోకి ఆమె వస్తే పాన్ ఇండియా అప్పీల్ వస్తుందనేది మేకర్స్ ఆలోచన.

రష్మిక ఆల్రెడీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. పైగా పుష్ప మూవీతో కూడా నార్త్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి ముద్దుగుమ్మ సినిమాలో ఉంటే రామ్-బోయపాటి ప్రాజెక్టు రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతానికైతే రష్మిక ఓకే చెప్పే స్టేజ్ లోనే ఉంది. ఎందుకంటే, కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ను ఆమెకు ఆఫర్ చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం… భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఇది రాబోతోంది. ప్రస్తుతం హీరో రామ్, ఇదే ప్రొడ్యూసర్ తో వారియర్ అనే సినిమా చేస్తున్నాడు.