ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా సలార్. ఈ సినిమా దసరాకు విడుదల అన్నది ఇప్పటి వరకు వున్న వార్త. కానీ ఈ సినిమా రెండు భాగాలుగా మార్చారన్నది అనధికారికంగానే అందరికీ తెలిసిపోయిన వార్త.
అందుకే ఈ సినిమా దసరాకు రాకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కేజిఎఫ్ విడుదల హడావుడిలో వున్నారు సలార్ దర్శకుడు. హీరో ప్రభాస్ రెస్ట్ లో వున్నారు.
త్వరలో ప్రాజెక్ట్ కే, సలార్..వీటి నడుమ రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) సినిమాల షూటింగ్ లు సమాంతరంగా జరుగుతాయి. అందువల్ల సలార్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం వుందని వినిపిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మీదనే ఎక్కువ హోప్ తో వున్నారు.
దాన్ని ఎలాగైనా ఈ ఏడాదే విడుదల చేయాలన్న ప్రయత్నం అయితే వుంది. కానీ రెండు భాగాలుగా మార్చడం వల్ల మరి కాస్త షూటింగ్ పెరిగిందని, అది కూడా తొలి పార్ట్ లోకి వచ్చేది వుందని బోగట్టా.
సమ్మర్ అయితే తప్ప ప్రభాస్ సెట్ మీదకు వచ్చే అవకాశం తక్కువ అని, అందువల్ల అన్ని రకాల కారణాలు కలిసి సలార్ ను ఆలస్యం చేసే అవకాశం వుందని వినిపిస్తోంది.