రవితేజ-నక్కిన త్రినాధరావు కాంబినేషన్ లో తయారవుతున్న పక్కా మాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఢమాకా…ఈ సినిమా విడుదలకు డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 23 విడుదల అని ప్రకటించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను 21 ఉదయం విడుదల చేస్తున్నారు. ఆ సమయంలోనే విడుదల డేట్ కూడా ప్రకటించే అవకాశం వుంది.
ఇప్పటి వరకు ఆ డేట్ కు బాలయ్య ‘వీరసింహారెడ్డి’ వచ్చే అవకాశాలు వున్నాయని భావించి, రిలీజ్ డేట్ ప్రకటించకుండా ఆగారు. ఇప్పుడు సంక్రాంతి డేట్ కు ఆ సినిమా వెళ్లిందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ డేట్ ఫ్రీ అయింది. సో అందుకే ఢమాకా కు ఆ డేట్ ప్రకటించే అవకాశం వుంది.
నిజానికి మైత్రీ సంస్థ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా కూడా వుంది దాన్ని బాలయ్య సినిమా డేట్ కు వేద్దాం అనుకున్నారు. కానీ అదే రోజు ఢమాకా వస్తే, ఓపెనింగ్ కచ్చితంగా సమస్య అవుతుంది. అందుకే కళ్యాణ్ రామ్ సినిమాను డిసెంబర్ 8 లేదా 9 న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
డిసెంబర్ తొలివారంలో నాని నిర్మిస్తున్న ‘హిట్’ సినిమా విడుదల వుంది. అలాగే థనుష్ ‘సర్’ సినిమా కూడా డిసెంబర్ తొలివారంలోనే వుంది. సితార సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు.