డిసెంబర్ బరిలోకి ‘కంగువ’!

గత కొన్నేళ్లుగా డిసెంబర్ నెల కూడా సినిమాలకు సెంటిమెంట్ గా మారుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలకు ఇప్పటికి మూడు సినిమాలు డేట్ లు వేసాయి. Advertisement నితిన్ రాబిన్ హుడ్, చైతన్య తండేల్…

గత కొన్నేళ్లుగా డిసెంబర్ నెల కూడా సినిమాలకు సెంటిమెంట్ గా మారుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలకు ఇప్పటికి మూడు సినిమాలు డేట్ లు వేసాయి.

నితిన్ రాబిన్ హుడ్, చైతన్య తండేల్ ముందుగా అనౌన్స్ చేసాయి. లేటెస్ట్ బన్నీ పుష్ప 2 అనౌన్స్ చేసారు. అందువల్ల ముందుగా అనుకున్న రెండు సినిమాలు వస్తాయో, రావో తెలియదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా దీపావళికి కనుక రాలేకపోతే డిసెంబర్ లో వస్తుంది అనే టాక్ వుంది.

ఇవన్నీ ఇలా వుంటే తమిళ సూపర్ స్టార్ సూర్య పీరియాడిక్ సినిమా ‘కంగువ’ ను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20న కంగువ ను విడుదల చేసే ఆలోచనను, నిర్మాత జ్ఙాన్ వేల్ రాజా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ కు జ్ఙాన్ వేల్ రాజాకు మంచి సంబంధాలు వున్నాయి. అందువల్ల బన్నీ సినిమా వచ్చిన రెండు వారాలకే కంగువ రాకుండా చూస్తారేమో మరి. తెలుగునాట ఎలా వున్నా, తమిళంలో పుష్ప 2 కు అడ్డం పడుతుంది.

తెలుగులో కూడా పుష్ప 2 కు పండగ వరకు అంటే దాదాపు నాలుగు వారాలకు పైగా ఏ సినిమా అడ్డం పడకుండా ఇటు మైత్రీ అటు అల్లు అరవింద్ చూస్తారు. మరి ఇప్పుడు ఈ చిక్కుల నడుమ కంగువ రిలీజ్ ప్లాన్ ఎలా వుంటుందో చూడాలి మరి.