ఇస్మార్ట్ కు పోటీగా తంగలాన్

డబుల్ ఇస్మార్ట్ సినిమా సోలోగా బరిలోకి దిగుతోంది అనుకున్నారంతా, పుష్ప 2 వాయిదా పడి, ఈ సినిమాకు ఆ డేట్ వేసినపుడు. ఓ బుల్లి సినిమా ‘ఆయ్’ ను గీతా సంస్థ విడుదలకు రెడీ…

డబుల్ ఇస్మార్ట్ సినిమా సోలోగా బరిలోకి దిగుతోంది అనుకున్నారంతా, పుష్ప 2 వాయిదా పడి, ఈ సినిమాకు ఆ డేట్ వేసినపుడు. ఓ బుల్లి సినిమా ‘ఆయ్’ ను గీతా సంస్థ విడుదలకు రెడీ అయింది. సర్లే, అది మాస్ పెద్ద సినిమా. ఇది ఎన్టీఆర్ బ్రదర్ ఇన్ లా నటించిన చిన్న సినిమా అనుకున్నారు అంతా. ఇప్పుడు మరో పెద్ద సినిమా బరిలోకి దిగుతోంది.

విక్రమ్ నటించిన తంగలాన్. అయితే ఇదో చిత్రమైన సినిమా. ఇప్పటి వరకు బయటకు వచ్చిన కంటెంట్ ను బట్టి, అటు పీరియాడికల్ సినిమానో, ఇంకోటో.. ఇంకోటో అంతు పట్టని సినిమా. కానీ తమిళ సినిమాలతో వ్యవహారం ఎలా వుంటుందీ అంటే నచ్చితే మనవాళ్లు నెత్తిన పెట్టేసుకుంటారు. నచ్చకపోతే ఏ గొడవా లేదు. నచ్చితే మాత్రం పూరి-రామ్ ల డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్లకు కన్నం పడే ప్రమాదం వుంది.

జూన్ నెలాఖరులో కల్కి, జూలై నెల మధ్యలో ఇండియన్ 2, ఆగస్ట్ 15 కు డబుల్ ఇస్మార్ట్, తంగలాన్..మొత్తం మీద మళ్లీ థియేటర్లకు కళ వస్తోంది.