ఆటోనగర్ సూర్య.. నాగచైతన్య-సమంత ప్రేమకు బీజం వేసిన సినిమాగా చెబుతారు దీన్ని. అంతకుముందు వీళ్లిద్దరూ ఏమాయచేశావె సినిమా చేసినప్పటికీ.. ఆటోనగర్ సూర్య సినిమాతోనే వీళ్ల ప్రేమ మొగ్గ తొడిగిందంటారు. ఆ సినిమాను డైరక్ట్ చేసిన దేవ కట్టా, ఇప్పుడు తన హీరోహీరోయిన్ల విడాకులపై స్పందించాడు.
“బంధం వర్కవుట్ కానప్పుడు.. బలవంతంగా, సమాజం కోసం నరకం అనుభవించడం కంటే, భర్త-భార్య అనే ట్యాగ్స్ ను వదిలించుకోవడమే బెటర్. భార్యాభర్తలు కాకముందు వాళ్లు మంచి ఫ్రెండ్స్. ఆ విషయం నాకు తెలుసు. ఫ్యామిలీ లైఫ్ వర్కవుట్ కానప్పుడు.. విడిపోయి ఎవరి దారులు వాళ్లు చూసుకొని, స్నేహితులిగా కొనసాగడం అనేది చాలా మంచి విషయం. అందులో తప్పు లేదు.”
ఇలా నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించాడు దేవకట్టా. ఈ సందర్భంగా ఆటోనగర్ సూర్య టైమ్ లో సమంత-చైతూ ఎలా ఉండేవారనే విషయంపై స్పందించాడు. ఇద్దరూ చాలా మంచి వ్యక్తులు అంటున్నాడు.
“నా సినిమా టైమ్ లో వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్. చాలా మెచ్యూర్డ్ గా ఉండేవారు. ఆ టైమ్ లో వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని నేను అనుకోను. ఒకవేళ వాళ్లు నా సినిమా సెట్స్ లో ప్రేమలో పడినా, ఆ విషయం నాకు తెలియదు కదా. ఎందుకంటే, సెట్స్ లో అంతా ప్రొఫెషనల్ గానే ఉన్నారు. వాళ్లిద్దరి మధ్య లవ్ నడిచిన విషయాన్ని నేను అప్పట్లో గమనించలేదు.”
సమంత కంటే నాగచైతన్య తనకు చాలా క్లోజ్ అంటున్నాడు దేవ కట్టా. చైతన్య అంటే తనకు చాలా ఇష్టమని, కుదిరితే నాగచైతన్యతో ఓ ప్రేమకథ తీస్తానని అంటున్నాడు ఈ డైరక్టర్.