‘దేవర’.. డ్యాన్స్ ఓకె..!

దేవర సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట వచ్చింది. ఈ పాట కోసం అభిమానులు చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా బాగా చేసారు ఈ పాటలో అని…

దేవర సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట వచ్చింది. ఈ పాట కోసం అభిమానులు చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా బాగా చేసారు ఈ పాటలో అని ముందే టాక్ వచ్చింది కనుక.

ఇప్పుడు పాట విడుదలైంది. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్. అనిరుధ్ సంగీతం. వాస్తవం మాట్లాడుకోవాలంటే పాట ట్యూన్ అంత క్యాచీగా లేదు. ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటల రేంజ్‌ కు ఈ పాట చేరాలంటే కాస్త ఎక్కువ టైమ్ నే పట్టేలా వుంది.

రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యం జ‌స్ట్ ఓ టైమ్ పాస్ సాంగ్ కు వున్నట్లే వుంది. ‘చెలికూన… వయసాకు..విస్తరెయ్యాల..అన్న లైన్ కాస్త కొత్తగా వుంది. పాటలో మిగిలిన పదాలు అన్నీ రొటీన్ నే. ఆ సంగతి అలా వుంచితే కిళి.. కిళి.. కిళియే…దావూదీ..వాదీరే..వాదీరే…అంటూ లల్లాయి పదాలతో నింపేయడం మరి అనిరుధ్ ట్యూన్ డిమాండ్ చేసిందో, మరేంటో దర్శకుడు కొరటాలకే తెలియాలి.

అనిరుధ్ ట్యూన్ లో అక్కడక్కడ పాత వాసనలు వినిపించాయి. మూడు శాతం కొత్తదనం, పాతిక శాతం అనిరుధ్ కు అలవాటైన స్టయిల్ అనిపించింది. పాట సంగతి అలా వుంచితే ఎన్టీఆర్ డ్యాన్స్ బాగుంది. ఫాస్ట్ స్టెప్ లు కాదు కానీ కొత్తగా ట్రయ్ చేసినట్లుంది. ఎన్టీఆర్ ముందు జాన్వి కొంచెం తేలిపోయినట్లే అనిపించింది. దేవర సినిమా ఈ నెల 27న థియేటర్‌లోకి వస్తోంది.

3 Replies to “‘దేవర’.. డ్యాన్స్ ఓకె..!”

Comments are closed.