ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ సినిమా దేవర. పాన్ ఇండియా హెవీ ఎమోషనల్ మాస్ ఎంటర్ టైనర్. ఈ సినిమా అప్ డేట్ ల కోసం, కంటెంట్ కోసం తారక్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి ఓ గ్లింప్స్ మాత్రమే వచ్చింది. ఈ నెలలో ఎన్టీఆర్ బర్త్ డే వుంది. అందువల్ల కచ్చితంగా ఏదో ఒక కీలకమైన అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా వున్నారు.
అందు కోసమే దేవర యూనిట్ ఓ సాంగ్ ను రెడీ చేస్తోంది. టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను వదలాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ వెర్షన్ కట్ చేయించారు. మరో వెర్షన్ కూడా చేస్తున్నారు. ఏది బాగుంటే అది వదులుతారు. లేదూ, టైమ్ కు రెడీ కాకుంటే ప్రోమో కట్ చేసి, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి సాంగ్ వదులుతారు.
మొత్తం మీద ఈ నెలలో దేవర ఫుల్ సాంగ్ రావడం ఖాయం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అనిరుధ్ డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. అందుకే చాలా ఆశలు వున్నాయి.
అందులోనూ టైటిల్ సాంగ్ అంటే అనిరుధ్ ఎలాంటి ఇంటర్ ల్యూడ్ సౌండ్స్ అందిస్తాడు. ఎలాంటి సిగ్నేచర్ సౌండ్స్ సెట్ చేస్తాడు అన్నది సినిమా ఫ్యాన్స్ అందరికీ ఆసక్తి కరమే.