ధనుష్ సినిమా ప్రకటన రేపే

తమిళ పాపులర్ క్రేజీ హీరో ధనుష్ తో డైరక్ట్ తెలుగు సినిమా ప్లాన్ చేసారని కొన్ని రోజుల క్రితం ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారిక…

తమిళ పాపులర్ క్రేజీ హీరో ధనుష్ తో డైరక్ట్ తెలుగు సినిమా ప్లాన్ చేసారని కొన్ని రోజుల క్రితం ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారిక ప్రకటన రేపు రాబోతోంది.  

యువతరం భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించగల టాలెంట్ వున్న డైరక్టర్ ఈ సినిమాకు పని చేయబోతున్నారు. ఇప్పటికే ఇదే డైరక్టర్ సినిమా నిర్మించి విడుదలకు సిద్దం చేసిన నిర్మాతే ధనుష్ సినిమాను కూడా నిర్మించబోతున్నారు.

తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమా ఒకేసారి తయారవుతుంది. ధనుష్ కు హిందీ లో నేరుగా చేయడం కొత్త కాదు. తెలుగులో నేరుగా చేయడం ఇదే ప్రధమం. అలాగే ఆ డైరక్టర్ కు నేరుగా హిందీ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి. 

కాస్త భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ డైరక్టర్ కాస్త రీజనబుల్ బడ్జెట్ లోనే సినిమాలు నిర్మిస్తున్నారు. కానీ ఇది మూడు భాషల్లో తయారు చేస్తుండడం, పాన్ ఇండియా సినిమా కావడంతో కాస్త గట్టి బడ్జెట్ నే అనుకుంటున్నారు.