ప్రముఖ డాన్స్ షో ఢీ లో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. తనకు అప్పులు ఎక్కువవుతున్నాయని వాటిని తీర్చలేక పోతున్నానని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. ఎంత ప్రయత్నించినా కూడా కుదరడం లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
మాస్టర్ చైతన్య స్వస్థలం నెల్లూరు జిల్లా ఉత్తమవారి పాలెం కాగా గత కొంత కాలంగా హైదరాబాద్లో ఉంటూ ఢీ షోలో డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్నారు. ఒక అప్పును పూడ్చుకునేందుకు.. మరో అప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని… నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని.. ఢీ ప్రోగ్రాం లో పేరు వచ్చింది కానీ.. సంపాదన తక్కువగా ఇస్తున్నారనీ.. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎక్కువ మనీ ఇస్తున్నారని.. అతడు సెల్ఫీ వీడియోలో చెప్పారు.
తన సెల్పీ వీడియోలో ఆత్మహత్యకు ముందు.. తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పారు.. అప్పులు ఇచ్చినవాళ్లు ఇస్తున్నా ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని అవేదన వ్యక్తం చేశారు. కాగా నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.